
కెరీర్ విషయానికి వస్తే రెజీనా ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్, ఓటీటీలలో మల్టీస్టారర్ సినిమాలు, క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. చివరగా మరీచిక, అజిత్ విడాముయార్చి చిత్రాల్లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ ఖాతాలో ఇప్పుడు ఆసక్తికరమైన లైనప్ ఉంది. మధుర్ భండార్కర్ డైరెక్షన్ లో వస్తున్న బాలీవుడ్ డ్రామా ‘ది వైవ్స్’ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి నితిన్ లుకోస్ డైరెక్షన్ లో ఒక పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది.
ఇవే కాకుండా హిందీలో సెక్షన్ 108 లాంటి భారీ చిత్రాల్లో కీలకమైన సపోర్టింగ్ రోల్స్ లో భాగం అవుతూ తన కెరీర్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటోంది. సోలో హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా మల్టీస్టారర్ ప్రాజెక్టులు, ఇంటెన్స్ థ్రిల్లర్లలో ఇంపార్టెంట్ రోల్స్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి ఫోటోషూట్స్ ద్వారా సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది.

Gulte Telugu Telugu Political and Movie News Updates
