Movie News

కమల్ హాసన్ రికార్డుని కమెడియన్ దాటేశాడు

కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో లెక్కలేనన్ని గొప్ప పాత్రలు పోషించారు. వాటిలో దశావతారంది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఎవరికీ సాధ్యం కాని విధంగా ఏకంగా పది పాత్రల్లో నటించి ఆల్ టైం రికార్డు సృష్టించారు. అంతకు ముందు ఒకే సినిమాలో తొమ్మిది క్యారెక్టర్లు చేసిన శివాజీ గణేశన్, ఏఎన్ఆర్ లను దాటేసి తన పేరు లిఖించుకున్నారు. తర్వాత ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. మహా అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు ట్రిపుల్ రోల్స్ చేశారు.

ఇదిలా ఉండగా ఇన్ని సంవత్సరాల దశావతారం రికార్డుని ఒక హాస్య నటుడు బ్రేక్ చేస్తున్నాడు. యోగిబాబు హీరోగా తమిళంలో రూపొందుతున్న ఒక మూవీలో అతను ఏకంగా 11 పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇవి కేవలం గెటప్స్ కాదు. కథ ప్రకారం అన్ని వేషాల్లో యోగిబాబు పరకాయ ప్రవేశం ఉంటుంది. కిషోర్ అనే యువకుడు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. హనుమాన్ జంక్షన్, చిరంజీవి గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన అనుభవముంది.

స్టోరీ దాచే ప్రయత్నం టీమ్ చేయలేదు. ఒక ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోతే అందులో బ్లాక్ బాక్స్ తెచ్చి ప్రభుత్వానికి ఇవ్వడం కోసం హీరో బయలుదేరతాడు. ఈ క్రమంలో ఎదురయ్యే చిత్ర విచిత్ర సంఘటనలే ఈ సినిమా కథ. హీరో, విలన్, కమెడియన్, డబుల్ యాక్షన్ ఇలా ఎన్నో షేడ్స్ లో యోగిబాబు కనిపిస్తారట. అలాని ఏదో తక్కువ బడ్జెట్ అనుకునేరు. ఇంగ్లాండ్, కెన్యా దేశాల్లో షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తారు. వినడానికి బాగానే ఉంది కానీ స్టోరీ ప్రకారం సహజంగా పదకొండు పాత్రలు ఉంటే బాగుంటుంది కానీ అదేదో రికార్డు కోసం కృత్రిమంగా ఇరికిస్తే మాత్రం మిస్ ఫైర్ అవుతుంది. నవరాత్రి, దశావతారంలు స్టార్లు నటించిన ఆల్ టైం క్లాసిక్స్. కానీ కేవలం హాస్య నటుడిగా గుర్తింపు ఉన్న యోగిబాబుతో ఇంత పెద్ద రిస్క్ చేయిస్తున్నారంటే కంటెంట్ లో ఏదో మ్యాటర్ ఉన్నట్టుంది. ఈ ఏడాదే విడుదలవుతుందట.

This post was last modified on July 5, 2026 5:59 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

2 hours ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

4 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

4 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

5 hours ago