Movie News

పసుపు చీరలో లెనిన్ భామ అందాల మెరుపు

అఖిల్ అక్కినేని సరసన లెనిన్ సినిమాలో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల విడుదలైన లెనిన్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రేమకథగా మొదలై గ్రామ పోరాటంగా మారే కథాంశాన్ని ట్రైలర్ ఆసక్తికరంగా చూపించింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ, సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి.

పసుపు రంగు సిల్క్ చీరలో భాగ్యశ్రీ ఎంతో అందంగా కనిపించింది. బంగారు జరీ వర్క్ ఉన్న చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ జత చేసి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయింది. మెడలో సింపుల్ నెక్లెస్, చేతికి గాజులు, వదులుగా వదిలిన జుట్టుతో ఆమె లుక్ మరింత అందంగా కనిపించింది. భారీ ఆభరణాల కంటే సింపుల్ స్టైలింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వడంతో చీర రంగు, ఆమె అందం రెండూ మరింత హైలైట్ అయ్యాయి.

ఇక కెరీర్ విషయానికి వస్తే, భాగ్యశ్రీ ఆశలన్నీ ఇప్పుడు లెనిన్ పైనే ఉన్నాయి. అఖిల్‌తో జోడీగా నటించిన ఈ సినిమా ఆమె కెరీర్‌లో కీలక మలుపు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఆ నమ్మకం మరింత బలపడుతోంది.

This post was last modified on July 5, 2026 6:55 pm

Page: 1 2

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

32 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

51 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

56 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago