Movie News

సమంత డామినేషన్ చూశారా?

సమంత కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ రిలీజై 20 రోజులు కావస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండో వీకెండ్ తర్వాత నిలబడలేకపోతున్నాయి. పెద్ది సినిమాకు సైతం అనుకున్న మోతాదులో లాంగ్ రన్ సాధ్యం కాలేదు. కానీ అంత పెద్ద సినిమా జోరుకు బ్రేక్ వేయడమే కాదు.. మూడో వీకెండ్లోనూ మంచి వసూళ్లు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది సమంత సినిమా. గత వారం అంటే చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు కాబట్టి ‘మా ఇంటి బంగారం’ సెకండ్ వీకెండ్లో కూడా డామినేషన్ చూపించిందంటే ఓకే అనుకోవచ్చు. 

కానీ ఈ వారం ‘నాగబంధం’, ‘రావు బహదూర్’ లాంటి సినిమాలు రిలీజైనా.. వాటి పోటీని తట్టుకుని సమంత సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్లో ‘నాగబంధం’ బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతుండగా.. రెండో స్థానంలో ‘మా ఇంటి బంగారం’ ఉండడం విశేషం. ‘రావు బహదూర్’ మూడో స్థానంలో ఉంది. బుక్ మై షోలో టికెట్ల అమ్మకాల ట్రెండ్ గమనిస్తే ఆర్డర్ ఇలాగే ఉంది. 

‘నాగబంధం’ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అందులో విజువల్స్, ఎఫెక్ట్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దాంతో పోలిస్తే ‘రావు బహదూర్’ బెటర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మాస్ ప్రేక్షకుల దృష్టిని ఈ చిత్రం ఆకర్షించలేకపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ రెండు కొత్త సినిమాలతో పోలిస్తే పాత చిత్రమైన ‘మా ఇంటి బంగారం’కే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో మూడో వీకెండ్లోనూ ‘మా ఇంటి బంగారం’కి మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి.

సమంత సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యుఎస్‌లో ఈ సినిమా అద్భుత ఘనత సాధించింది. ఈ చిత్రం అక్కడ 2 మిలియన్ డాలర్ల క్లబ్బులో అడుగు పెట్టడం విశేషం. నాన్ థియేట్రికల్ హక్కుల నుంచే పెట్టుబడి రాబట్టుకున్న ‘మా ఇంటి బంగారం’ టీంకు థియేటర్ల వస్తున్నదంతా లాభమే కావడం విశేషం.

This post was last modified on July 5, 2026 6:41 pm

Share

Recent Posts

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

1 hour ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

3 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

4 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

4 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

4 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

6 hours ago