మొన్నటిదాకా ఒక చిన్న సినిమా ప్రపంచ సినీ ప్రియులను ఊపేయడం అబ్సెషన్ విషయంలోనే జరిగింది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది వందల కోట్ల వసూళ్లను మంచి నీళ్లు తాగినంత ఈజీగా రాబట్టిన ఈ సైకో డ్రామా హైదరాబాద్ లో చాలా రోజులు హౌస్ ఫుల్స్ తో నడిచింది. జిల్లా కేంద్రాల్లో పెద్ది వల్ల ఒకటి రెండు వారాలు ఆలస్యంగా విడుదలైనా కలెక్షన్లు కురిపించుకుంది. తెలుగు డబ్బింగ్ లేకుండా చాలా చోట్ల సబ్ టైటిల్స్ వేయకుండా ఇంత మొత్తం రాబట్టడం మాములు విషయం కాదు.
అయితే నిర్మాత నాగవంశీ దీన్ని అనాలిసిస్ చేసిన కోణం ఇంకోలా ఉంది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెక్నికల్ అంశాల కోసం మనోళ్లు అబ్సెషన్ చూడలేదని, ఒక అమ్మాయిబ్ సైకోగా మారి ప్రియుడిని వేధిస్తే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చారని కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇలా అంటే తన మీద సోషల్ మీడియాలో అటాక్ జరుగుతుందని చెప్పడం గమనార్షం. గతంలో క్రిస్టోఫర్ నోలన్ సినిమాల గురించి వంశీ చేసిన కామెంట్స్ వైరలయ్యాయి.
నాణేనికి రెండు వైపులా తరహాలో నాగవంశీ చెప్పిన దాంట్లో తప్పు ఒప్పు రెండూ ఉన్నాయి. భాష అర్థం కాకపోయినా అందులో అంత గొప్పగా ఏముందో అని చూసిన ఆడియన్స్ భారీగా ఉన్నారు. ఊహించని ట్విస్టులతో హీరోయిన్ చేసే మర్డర్లకు థ్రిల్ అయినవాళ్ళు బోలెడు. ఇంకోవైపు సౌండ్ డిజైన్, కెమెరా వర్క్, దర్శకుడి ఆలోచనా విధానంకు అబ్బురపడి చూసినవాళ్లు ఎక్కువే. సో ఇదేదో ఆషామాషీ హిట్టుగా తీసుకునే మూవీ అయితే ఖచ్చితంగా కాదు.
అబ్సెషన్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తక్కువ ఖర్చులో అద్భుతాలు చేయొచ్చని అర్థమయ్యాక చాలా మంది ఫిలిం మేకర్స్ ఇప్పుడా దారిలోనే వెళ్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం మౌత్ టాక్ తో ఒక సినిమా ఇంత పెద్ద స్థాయికి వెళ్లడం ఒక రిఫరెన్స్ గా మారింది. గత రెండు నెలల్లో ఎందరో టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు పలు సందర్భాల్లో అబ్సెషన్ ప్రస్తావన తెచ్చి మరీ దాని గొప్పదనాన్ని పంచుకున్నారు. అన్నట్టు అబ్సెషన్ 2 ఉంటుందా లేదాని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
