
సీనియర్ హీరోయిన్ స్నేహ మరోసారి తన అందమైన ఫొటోలతో అభిమానులను పలకరించింది. తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. పూల తోటలో తీసిన ఈ ఫొటోల్లో సింపుల్ పోజులతోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
లైట్ పింక్ కలర్ డిజైనర్ చీరలో క్లాసీ లుక్‌లో మెరిసిపోయింది. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఆమె లుక్‌ను మరింత అందంగా మార్చింది. మెడలో పెర్ల్ హారం, చేతికి గాజులు, చెవులకు స్టోన్ ఇయర్‌రింగ్స్, హెయిర్‌బ్యాండ్‌తో ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది. చిన్న బొట్టు, సాఫ్ట్ మేకప్ లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
ఎలాంటి గ్లామర్ హడావుడి లేకుండానే తన స్టైల్‌తో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. ఈ ఫొటోల్లో కూడా అదే హుందాతనం కనిపిస్తోంది. ఈ తాజా స్టిల్స్‌ను చూసిన అభిమానులు “ఎప్పటికీ అదే అందం”, అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Gulte Telugu Telugu Political and Movie News Updates

