నటుడిగా తనలో ఎంత వర్సటాలిటీ ఉందో సత్యదేవ్ చాలాసార్లు నిరూపించాడు. కాకపోతే తన కమర్షియల్ మార్కెట్ పెంచే దర్శకుడు ఇప్పటిదాకా దొరక్కపోవడంతో అధిక శాతం ప్రయోగాలకు కట్టుబడ్డాడు. ప్రేక్షకుల్లో ఆ గౌరవం ఉంది కాబట్టే డైరెక్టర్ బ్రాండ్, ఇమేజ్ తో సంబంధం లేకుండా తన కోసమే వచ్చే ప్రేక్షకులతో ఓపెనింగ్స్ తేగలుగుతున్నాడు. అయితే ఈసారి రావు బహదూర్ లెక్కలన్నీ మార్చేస్తుందని, మార్కెట్ పెంచేస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు.
తను కోరుకున్నట్టే రావు బహదూర్ కు బోలెడు ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా సత్యదేవ్ పెర్ఫార్మన్స్ గురించి మెచ్చుకోని రివ్యూ లేదు, మాట్లాడని ఆడియన్స్ లేరు. అంత గొప్పగా యువకుడి నుంచి వృద్ధుడి దాకా అన్నీ షేడ్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేశాడు. తనవరకు ఒక్క శాతం వంక పెట్టడానికి లేకుండా బెస్ట్ ఇచ్చాడు. అయితే వసూళ్ల విషయానికి వస్తే రావు బహదూర్ పెద్ద స్థాయికి వెళ్తుందా లేదానే ప్రశ్నకు ట్రేడ్ వర్గాలు వెంటనే సమాధానం చెప్పలేకపోతున్నాయి.
ఎందుకంటే రావు బహదూర్ ఎక్స్ పరిమెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ మీద కొన్ని కంప్లయింట్స్ ఉన్నాయి. రెండో సగం అధిక శాతం ఆడియన్స్ ని సంతృప్తి పరిచింది. క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇది కుటుంబాలను తెచ్చే ఎలిమెంట్ అవుతుందా అంటే ఆన్సర్ వెంటనే అవును అని రావడం లేదు. ఎందుకంటే వెంకటేష్ మహా టేకింగ్ స్టయిల్ సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ సాధారణ జనాలకు అది అర్థం కావడం కీలకం ఇదే కలెక్షన్లకు ఆధారం. .
వీకెండ్ అయ్యాక రావు బహదూర్ ఏ దిశగా వెళ్తుందనేది క్లారిటీ వస్తుంది. విచిత్రం ఏమిటంటే మిక్స్డ్ టాక్ ఎక్కువ వినిపించిన నాగబంధంకే బుకింగ్స్ బాగుండటం. విజువల్ ఎఫెక్ట్స్ అందులోనూ డివోషనల్ మూవీ కావడంతో క్రౌడ్స్ బాగానే కనిపిస్తున్నాయి. రావు బహదూర్ గత ఇరవై గంటల్లో 37 వేలకు పైగా టికెట్లు అమ్మగా నాగబంధం 68 వేల టికెట్లతో బుక్ మై షోలో ఆధిపత్యం చెలాయిస్తోంది. అంటే దాదాపు రెట్టింపు వ్యత్యాసం ఉంది. రేపటికి ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.
This post was last modified on July 4, 2026 9:42 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…