టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టును సోమవారమే అనౌన్స్ చేశారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల క్రేజీ కాంబినేషన్లో సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా ఈ మైథాలజీ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కబోతోంది. ఈ సినిమా విషయంలో తారక్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. న్యూట్రల్ ఆడియన్స్‌లో కూడా ఈ సినిమా ఆసక్తి రేకెత్తించింది.
కానీ తమిళ జనాలు మాత్రం గాడ్ ఆఫ్ వార్ విషయంలో నెగెటివ్ కామెంట్లు చేస్తుండడం గమనార్హం. సోమవారం సాయంత్రం ఈ మూవీని అనౌన్స్ చేయడం ఆలస్యం.. తమిళ నెటిజన్లు నెగెటివ్ పోస్టులతో వెటకారాలడడం మొదలుపెట్టారు. తమిళులకు సుబ్రహ్మణ్యస్వామి చాలా ప్రత్యేకమైన దేవుడన్న సంగతి తెలిసిందే. మురుగుడు వెలసిన తిరుత్తణి తమిళనాడులోనే ఉంది.
తమిళంలో ఎన్నో సినిమాల్లో సుబ్రహ్మణ్యస్వామి రెఫరెన్సులు ఉంటాయి. అలాంటి దేవుడి మీద తెలుగులో ఇంత భారీ చిత్రం వస్తుండడంతో తమిళులు హర్షించాల్సింది పోయి.. నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్లో సంస్కృత శ్లోకం పెట్టారని, తమిళం ఉపయోగించలేదని అభ్యంతర పెడుతున్నారు. అంతే కాక మురుగుడు ఉత్తరాదిన పుట్టినట్లు నిర్మాత నాగవంశీ పెట్టిన కామెంట్ మీద వాళ్లు విరుచుకుపడుతన్నారు.
సుబ్రహ్మణ్యస్వామి వెలసింది తమిళనాడులో అని, చరిత్రను మార్చొద్దని, సినిమా కోసం ఇలా చేస్తే దీన్ని బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. తమ దేవుడి గురించి తెలియని వాళ్లు ఈ సినిమా తీస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోవడం, అదే సమయంలో తమ సినిమాలు వెనకబడిపోవడం పట్ల ఇప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న తమిళులు.. ఆ వ్యతిరేకతను కూడా కలిపి గాడ్ ఆఫ్ వార్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates