ఫిలిం సెలబ్రెటీల లగ్జరీస్ మీద ఎప్పుడూ అభిమానుల దృష్టి ఉంటుంది. వాళ్ల నివాసాలు.. వాళ్లు వాడే కార్లు.. ఇలా ప్రతి విషయం మీదా ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. మీడియా కూడా వాటికి విశేషమైన కవరేజీ ఇస్తుంది. బాలీవుడ్ విషయానికి వస్తే.. సెలబ్రెటీ ఇళ్లలో ఎక్కువగా చర్చనీయాంశం అయింది షారుఖ్ ఖాన్ ఇల్లు ‘మన్నత్’ అనడంలో సందేహం లేదు.
అందులో విశేషాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ఆయన ఇంటి విలువ కొన్నేళ్ల ముందే రూ.200 కోట్లు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎంత ఉందో మరి.
ఐతే షారుఖ్ తోటి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఇప్పుడు అతడిని మించిన విలాసవంతమైన ఇంటిని నిర్మించుకుంటున్నట్లు సమాచారం. దాని విలువ రూ.350 కోట్లని అంచనా. దీని నిర్మాణం ఇప్పుడు చురుగ్గా జరుగుతోంది.
సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులు 70వ దశకం నుంచి ఫేమస్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ దాన్ని కొన్నారు. ఆ ఇంటితో సల్మాన్‌కు గొప్ప అనుబంధం ఉంది.
ఐతే పాతదైపోయిన ఆ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి ఇప్పుడ ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకుంటున్నాడు సల్మాన్. బాంద్రాలోని చింబాయ్ ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని ఈ ఐదంతుస్థల ఇంటిని నిర్మిస్తున్నారు. దీనికి పర్మిషన్లు కూడా వచ్చేశాయి.
ఇంటి నిర్మాణం మొదలైపోయింది. చకచకా పనులు జరుగుతున్నాయి. ఆ ఇంటి నమూనాకు సంబంధించి కూడా ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అద్భుతమైన సీ వ్యూతో ఉండేలా ఈ ఇంటి నిర్మాణం జరుగుతోంది. సల్మాన్‌కు ఇటీవల భద్రత సమస్యలు కూడా తలెత్తిన నేపథ్యంలో అత్యంత సురక్షితంగా ఉండే ఈ ఇంటికి మారుతున్నట్లు తెలుస్తోంది. ఇంటి మొత్తానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుందని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates