బలమైన వారసత్వంతో అడుగు పెట్టే హీరోలకు తొలి సినిమా విడుదల కాకుండానే అవకాశాలు వస్తుంటాయి. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కూడా ఛాన్సులు అందుకుంటారు. కానీ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన అమ్మాయిలకు మాత్రం తొలి సినిమా ఫలితం ఎంతో కీలకం. ఆ సినిమా రిలీజై మంచి విజయం సాధించాక కానీ తదుపరి అవకాశాలు రావు. కానీ కృతి శెట్టి అనే కొత్తమ్మాయి మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలుస్తోంది.
మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన సినిమాతోనే ఈ అమ్మాయి కూడా టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. గత ఏడాది వేసవికే రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఐతే సినిమా రిలీజ్ కాకున్నప్పటికీ ప్రోమోల్లో తనదైన అందం, హావభావాలతో కృతి ఆకట్టుకుంది.
కృతి గురించి చిత్ర బృందం నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉండటం, ఇండస్ట్రీలో కొందరు సినిమా కూడా చూసి తన పెర్ఫామెన్స్ పట్ల ఇంప్రెస్ కావడంతో ఈ అమ్మాయికి మంచి మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్‌లో ఓ కథానాయికగా కృతి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో కృతి అవకాశం దక్కించుకుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడి కొత్త సినిమాలో కృతినే కథానాయిక. ఇందులో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. సోమవారమే ఈ సినిమా లాంచ్ అయింది. ఇంద్రగంటి సినిమాల్లో కథానాయికలకు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో, ఆయన హీరోయిన్లను ఎంత బాగా చూపిస్తారో తెలిసిందే కాబట్టి కృతి మరో బంపరాఫర్ కొట్టేసినట్లే. ఉప్పెన రిలీజ్ కాకముందే ఈమె జోరిలా ఉంటే.. ఆ సినిమా విడుదలై మంచి పేరొస్తే ఇంకెంత ఊపుంటుందో?
This post was last modified on January 5, 2021 8:40 am
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…