మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన రావడం మామూలే. ఆ పేరు వినిపించినపుడు ఆడిటోరియాలు ఎలా హోరెత్తిపోతాయో తెలిసిందే. లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాహుబలి-2 సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ రాయడానికి స్ఫూర్తి పొందే స్థాయిలో ఇదొక హిస్టీరియాలా మారిన సంగతి తెలిసిందే. దీని మీద కొన్ని వివాదాలు కూడా నడిచిన విషయమూ విదితమే.
కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం వాటిని పట్టించుకోకుండా.. తమకు అలవాటైన విధంగానే ప్రతి ఈవెంట్లోనూ పవన్ నినాదాలతో ఆడిటోరియాలు దద్దరిల్లేలా చేస్తుంటారు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఓ మెగా ఈవెంట్లో పవన్ నినాదాలు ఆడిటోరియాన్ని షేక్ చేశాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రం పెద్ది సక్సెస్ మీట్లో ఇది జరిగింది.
మెగాస్టార్ చిరంజీవితో పాటు అగ్ర దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరైన పెద్ది సక్సెస్ ఈవెంట్లో నిర్మాత సతీష్ కిలారు మాట్లాడేటపుడు.. తమ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశమిచ్చిన ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు.
పవన్ పేరెత్తగానే అభిమానులు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఎప్పట్లాగే స్పీకర్ ప్రసంగాన్ని కాసేపు ఆపాల్సి వచ్చింది. అంతకంతకూ అరుపులు, కేకలు పెరిగాయి. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ఆడిటోరియం దద్దరిల్లేలా చేశారు.
ఆ సమయంలో చిరు మందహాసంతో చూస్తూ ఉన్నారు. తమ్ముడి కోసం అభిమానులు అంతగా అరుస్తుంటే ఆయనలో సంతోషం కనిపించింది. తర్వాత సతీష్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. టికెట్ల రేట్ల కోసం పవన్‌ను కలిసినపుడు, మీ వెనుక నేనున్నా సినిమా రిలీజ్ చేయండి అంటూ మద్దతుగా నిలిచినట్లు గుర్తు చేసుకున్నారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన పెద్ది వరల్డ్ వైడ్ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి ఫలిఆన్నే అందుకోగా.. మిగతా చోట్ల అంచనాలను అందుకోలేకపోయింది.
This post was last modified on June 23, 2026 11:10 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…