కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్ వచ్చాక కూడా భారీ పారితోషకాల కోసం ఆశపడి నటనకు ప్రాధాన్యం లేని పాత్రలే చేస్తారు. కమర్షియల్ చిత్రాలు, గ్లామర్ రోల్స్ విషయంలో ఏమాత్రం అభ్యంతరం పెట్టకుండా సినిమాలు చేసుకుంటూ పోతారు. కానీ వయసు మీద పడడం వల్లో, కొత్త హీరోయిన్ల పోటీ వల్లో అవకాశాలు తగ్గుముఖం పట్టగానే అంతకుముందు చేసిన గ్లామర్ రోల్స్ విషయంలో తక్కువ చేసి మాట్లాడ్డం చాలామంది స్టార్ హీరోయిన్లకు అలవాటు.
ముఖ్యంగా దక్షిణాది సినిమాల్లో కెరీర్ బాగా సాగినన్ని రోజులు ఇక్కడి ఇండస్ట్రీలను కొనియాడి.. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ ఒకటీ అరా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయగానే.. సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన చాలామంది హీరోయిన్లను చూశాం. ఇలియానా, తాప్సి లాంటి వాళ్లు ఈ కోవకే చెందుతారు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇదే బాటలో సాగుతోంది.
ఇన్నాళ్లూ సౌత్ సినిమాల గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చిన తమన్నా సైతం.. ఏరు దాటాక తెప్ప తగలేసిన తరహాలోనే ఇక్కడి చిత్రాల గురించి ఒక ఇంటర్వ్యూలో తక్కువ చేసి మాట్లాడింది. దక్షిణాది సినిమాల్లో హీరోయిన్లకు అంతగా ప్రశంసలు దక్కవని తమన్నా వ్యాఖ్యానించింది. నటనకు ప్రాధాన్యమిచ్చేవారు, గ్లామరస్ పాటలకు డ్యాన్సులకు ఆసక్తి చూపేవారు అని హిందీలో ప్రధానంగా రెండు రకాల హీరోయిన్లుంటారని.. అక్కడ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని తమన్నా అభిప్రాయపడింది.
ఈ రెంటినీ బ్యాలెన్స్ చేసేవాళ్లు అక్కడ సూపర్ స్టార్లు అవుతారని ఆమె చెప్పింది. కానీ దక్షిణాదిన కమర్షియల్ సినిమాలకు ఒక నిర్దిష్టమైన ఫార్మాట్ ఉంటుందని.. ఇక్కడ పురుషాధిక్య భావజాలం ఎక్కువ అని.. హీరోయిన్లను చూసే విధానం అంత గొప్పగా ఉండదని ఆమె అంది. దక్షిణాది సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన కొంత కాలానికే తనకీ విషయం అర్థమైందని.. ఐతే ఇది తన వ్యక్తిగత అనుభవమే అని.. మిగతా వారికి ఇలాంటి అనుభవం, అభిప్రాయమే ఉండాలని లేదని తమన్నా చివర్లో డిస్క్లైమర్ వేసేసింది.
ఐతే తమన్నా సమకాలీన హీరోయిన్లలోనే అనుష్క, సమంత ఎలాంటి పెర్ఫామర్లుగా గుర్తింపు సంపాదించారో.. వాళ్లు ఎంత మంచి పాత్రలు చేశారో తమన్నాకు తెలియంది కాదు. ఇప్పుడు కూడా సాయిపల్లవి సహా పలువురు కథానాయికలు ఎలాంటి పాత్రలు చేస్తున్నారో, ఎంత మంచి పేరు సంపాదించారో తెలిసిందే. దక్షిణాదిన ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉండగా.. బాలీవుడ్ ఏదో ఉన్నతమైన ఇండస్ట్రీ అన్నట్లు తమన్నా లాంఇ వాళ్లు మాట్లాడ్డం విడ్డూరమే.
This post was last modified on June 23, 2026 10:49 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…