2021లో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీఎఫ్: చాప్టర్-2’ ఒకటి. ఈ వేసవిలోనే ‘కేజీఎఫ్’ వివిధ భాషల్లో సందడి చేయబోతోంది. ఈ సినిమా టీజర్ కోసం చాలా రోజుల నుంచి కౌంట్ డౌన్ నడుస్తోంది. ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరింది.
ఈ నెల 8న హీరో యశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందే సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. టీజర్ టైమింగ్ కూడా చెప్పేశారు. ఈ శుక్రవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ‘కేజీఎఫ్-2’ టీజర్ విడుదల కానుంది. గుబురు గడ్డంతో ఉన్న రాకీ ఒక రాడ్ పట్టుకుని కూర్చున్న మాస్ ఫొటోతో టీజర్ అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
‘కేజీఎఫ్’ తొలి భాగం సూపర్ సక్సెస్ అయ్యాక, పెరిగిన అంచనాల నేపథ్యంలో ‘చాప్టర్-2’ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించి ఉంటాడని భావిస్తున్నారు. టీజర్లో ఆ భారీతనం అంతా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. టీజర్లో ప్రశాంత్ మార్కు హీరో ఎలివేషన్ల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్’ తొలి భాగంలో రాకీ కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి ప్రవేశించి గరుడను చంపడం వరకు చూపించిన ప్రశాంత్.. రెండో భాగంలో కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుని దాన్ని రాకీ ఎలా ఏలాడో.. చివరికి అతడి కథ ఎలా ముగిసిందో చూపించనున్నాడు.
రెండేళ్ల కిందట ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. కన్నడలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి కానీ.. ఇతర భాషల్లో ముందు దీన్నంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.. ఇలా అన్ని భాషల వాళ్లూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా బాక్సాఫీస్ రన్ పూర్తయిన దగ్గర్నుంచి చాప్టర్-2 కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ.. కరోనా వల్ల ఆలస్యం తప్పలేదు.
This post was last modified on January 4, 2021 5:41 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…