దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్లో ఖాన్ త్రయానిదే ఆధిపత్యం. పారితోషకాల్లో కొత్త రికార్డులు నమోదు చేసినా.. కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టినా వారికే చెల్లింది. వార్షికాదాయం విషయంలోనూ వాళ్లను కొట్టే హీరోలు మరెవ్వరూ కనిపించలేదు. నంబర్ గేమ్ కూడా వారి చుట్టూనే తిరిగింది. మధ్యలో హృతిక్ రోషన్ కొంత పోటీ ఇచ్చాడు కానీ.. నిలకడ లేక ఖాన్ త్రయం ముందు నిలవలేకపోయాడు.
ఐతే ఇదంతా ఐదారేళ్ల ముందు మాట. ఈ ఐదారేళ్లలో మాత్రం కథ మారిపోయింది. ఖాన్ త్రయం జోరు తగ్గింది. అక్షయ్ కుమార్ అనే మీడియం రేంజ్ హీరో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. పారితోషకం, వార్షికాదాయం విషయంలో ఖాన్ త్రయాన్ని దాటి అతను ముందుకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.100 కోట్లుక పైగా పారితోషకం తీసుకునే రేంజికి చేరుకున్నాడతను.
ఖాన్ త్రయంలా కాకుండా చాలా వేగంగా సినిమాలు చేసే అక్షయ్.. ఏడాదికి మూణ్నాలుగు చిత్రాలు లాగించేస్తుంటాడు. అందుకే వార్షికాదాయంలో ప్రస్తుతం అతణ్ని కొట్టే బాలీవుడ్ హీరో లేడు. ఆరేళ్ల వ్యవధిలో అతను ఏకంగా రూ.1744 కోట్లు ఆర్జించాడంటే అతి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది కోవిడ్ సినీ పరిశ్రమపై ఏ స్థాయి ప్రభావం చూపిందో తెలిసిందే. ఇలాంటి సమయంలోనూ ఏడాదిలో రూ.356.57 కోట్ల ఆదాయం అందుకుని ఔరా అనిపించాడు అక్షయ్. అంతకుముందు ఏడాది ఇంతకంటే మించి ఆదాయం అతడి సొంతమైంది. 2019లో రూ.459.22 కోట్లు ఆర్జించాడు అక్షయ్. అంతకుముందు నాలుగేళ్ల సంగతి చూస్తే.. 2015లో రూ.208.42 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2017లో 231.06 కోట్లు, రూ.277.06 కోట్ల చొప్పున ఆదాయం అందుకున్నాడు అక్షయ్. ఇలా ఆరేళ్ల వ్యవధిలో రూ.1744 కోట్ల ఆదాయంతో ఇండియాలో ఏ హీరో అందుకోలేని స్థాయిలో అక్షయ్ నిలిచినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది.
This post was last modified on January 4, 2021 5:31 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…