
తమిళ ఇండస్ట్రీతో పాటు డిజిటల్ స్పేస్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటోంది తేజు అశ్విని. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ, లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ట్రెడిషనల్ శారీ లుక్‌లో లైట్ మేకప్, దానికి తగ్గ జ్యువెలరీతో హోమ్‌లీగా కనిపిస్తూనే ఒక క్లాసిక్ వైబ్‌ను తీసుకొచ్చింది. నార్మల్ గా గ్లామర్ షో వైపు వెళ్లకుండా, ఇలాంటి పద్ధతైన లుక్స్‌తోనే ఒక డీసెంట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయవచ్చని ఈ ఫోటో టాక్ చూస్తే అర్థమవుతోంది.

కెరీర్ విషయానికి వస్తే.. తేజు అశ్విని మొదట్లో మోడలింగ్, ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. యూట్యూబ్ లో వచ్చిన ‘కల్యాణ సమయాల్’ లాంటి పాపులర్ డిజిటల్ సిరీస్ లతో పాటు కొన్ని వైరల్ మ్యూజిక్ వీడియోల ద్వారా మొదటగా జనాలు ఈమెను నోటీస్ చేశారు. ముఖ్యంగా నటుడు కవిన్ పక్కన చేసిన ‘అస్కు మారో’ మ్యూజిక్ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించడంతో ఈమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ క్రేజ్ తోనే మెల్లగా వెండితెరపై అవకాశాలు దక్కించుకుంది.
సినిమాల్లో సంతానం నటించిన ‘పారిస్ జయరాజ్’ (2021) మూవీలో ఒక చిన్న సాంగ్ అప్పియరెన్స్ తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2022 లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘ఎన్న సొల్ల పొగిరాయ్’ లో ప్రీతి అనే క్యారెక్టర్ తో మెయిన్ లీడ్ గా తన ఫస్ట్ మేజర్ రోల్ అందుకుంది. అదే ఏడాది విజయ్ సేతుపతి, నయనతార నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో సమంత ఫ్రెండ్ గా ఒక సపోర్టింగ్ రోల్ లోనూ కనిపించి మెప్పించింది.

Gulte Telugu Telugu Political and Movie News Updates