మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్ గా మాట్లాడకపోవడమే సక్సెస్ గా భావించే ట్రెండ్ లో దర్శక నిర్మాతలు ఆ కోణంలో విజయం సాధించారు. ఆ ఆనందాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ నిర్వహించి తమ సక్సెస్ గురించి చెప్పుకొచ్చారు. అయితే సెన్సార్ తమకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేవనెత్తిన ప్రశ్నలు, పాయింట్లు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
బూతులు అశ్లీలత లేని తమ సినిమాకు అడిగినవి కట్ చేశాక కూడా ‘ఏ’ ఇవ్వడం ఏమిటనే ఆవేదన టీమ్ సభ్యుల మాటల్లో స్పష్టంగా కనిపించింది. బయటికి చెప్పుకోలేని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయలేని వేరే సినిమాలకు యు/ఏ ఇచ్చి మాకు ఏ ఇవ్వడం వల్ల స్వంత కుటుంబ సభ్యులతోనే థియేటర్ కు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇంతమంది దీవానా మెంబర్స్ చేసిన కామెంట్స్ కి సెన్సార్ స్పందిస్తుందో లేక ఇవన్నీ మాములే అనుకుంటుందో వేచి చూడాలి.
ఇక్కడో ఇంకో వాస్తవం అంగీకరించాలి. దీవానాకు వచ్చిన సమస్య కేవలం సెన్సార్ ఒకటే కాదు. రిలీజ్ టైమింగ్ కూడా తేడా జరిగింది. మా ఇంటి బంగారంని తక్కువ అంచనా వేసి దాంతో పాటు మాది కూడా ఆడుతుందనే ధైర్యంతో విడుదల చేయడం మంచిదే. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ గంపగుత్తగా దానికే ఎక్కువగా వెళ్లే రిస్కుని ప్రొడ్యూసర్లు ముందుగా గుర్తించలేకపోయారు. సమంత ప్రవాహంలో పోటీ సినిమాలు నిలదొక్కుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్.
ఒకవేళ దీవానా ఇంకో వారం ఆగి లేదా ఒక వారం ముందే వచ్చి ఉంటే సోలో రిలీజ్ దక్కి సోషల్ మీడియా అటెన్షన్ కూడా దానివైపే ఉండేదేమో. ఇప్పుడు ఎక్స్, ఇన్స్ టాలో చూస్తున్న రియాక్షన్లు అప్పుడూ వచ్చి వసూళ్లకు దోహదపడేవి. అయినా ఏ ఇచ్చినంత మాత్రం జనాలందరూ థియేటర్లకు దూరంగా ఉండరు. కాకపోతే పబ్లిసిటీ పరంగా దీవానా పూర్తి స్థాయిలో జనాలకు రీచ్ అవ్వలేకపోయింది. ఏదైనా కొత్త స్ట్రాటజీతో ముందుకు వేస్తే అన్ని సెంటర్లలో ఊపందుకునే ఛాన్స్ లేకపోలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates