స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ముఖ్యంగా అవసరాలతో నడిచే సినీ పరిశ్రమలో తక్కువగా చూస్తాం. అలాంటిది ఒక ప్యాన్ ఇండియా హీరో ఫ్రెండ్ షిప్ కిస్తున్న విలువ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. తనే అల్లు అర్జున్. ఏ ప్రయాణం మొదట్లోనే గొప్ప మలుపు అందుకోదు. దానికి ఎందరో మిత్రుల చేయూత కావాలి. బన్నీకి అలాంటి ఆత్మీయులు ఉన్నారు.
కొన్ని నెలల క్రితం ప్రకటించిన అల్లు అర్జున్ 23 షూటింగ్ ప్రారంభం కాకముందే ఎంత క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందే ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు బన్నీ వాస్, సందీప్ రామినేని, నటరాజ్, స్వాతిలు నిర్మాణ భాగస్వాములుగా ఉంటున్నారు. వీళ్లంతా అల్లు అర్జున్ స్నేహితులే. ఐకాన్ స్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా ఇందులో పార్ట్ నర్స్ కావడం కన్నా ఆనందం ఇంకేముంటుంది.
గంగోత్రి నుంచి రాకా దాకా తన జర్నీలో పక్కనే ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ తోడుగా నిలబడిన మిత్రులను అల్లు అర్జున్ ఇప్పుడీ ఏఏ 23లో భాగం చేయడం ద్వారా స్నేహానికి తానిచ్చే ప్రాధాన్యం ఎలా ఉంటుందో మరోసారి చాటి చెప్పాడు. బయట ప్రపంచానికి ఇదంతా తెలిసి ఉండకపోవచ్చు. అయితే తనతో పాటు తన వాళ్ళూ ఎదగాలన్న బన్నీ ఆకాంక్ష మిత్రులను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడుతోంది. స్నేహం విలువ చాటుతోంది.
ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ ఉదాహరణ స్ఫూర్తినిస్తుందని చెప్పడంలో అనుమానం లేదు. ఎందుకంటే నిజమైన స్నేహం కేవలం సక్సెస్ లో మాత్రమే కాదు అన్నిట్లోనూ తోడు ఉంటుంది. పెద్ద స్టార్ కావడం కాదు ముఖ్యం, స్నేహమనే బంధంతో మనతో పాటే ఉన్నోళ్లు ఇంకా గొప్ప స్టేజికి చేరుకోవాలని కోరుకోవడం, దానికి తగ్గ సహకారం అందించడం ఆదర్శం. అల్లు అర్జున్ మాటల్లో కాదు దాన్ని చేతల్లో చూపిస్తున్నారు. అందుకే స్వచ్ఛమైన స్నేహితులు మన జీవితానికి నిజమైన కానుకలు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

