Movie News

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన మార్కెట్ ని డ్యామేజ్ చేసిన మాట నిజమే కానీ ఒక హిట్టు పడితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే సహృదయం టాలీవుడ్ ఆడియన్స్ కి ఉంది తాజాగా విడుదలైన వంద దేవుళ్ళుకు డీసెంట్ టాక్ వచ్చింది. రివ్యూలు మరీ నెగటివ్ గా రాలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సౌండ్ లేదు. ప్రమోషన్ల పరంగా శ్రద్ధ తీసుకోకపోవడం కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది.

కథ పరంగా ఉన్న సున్నితమైన అంశం మన జనాలకు కనెక్ట్ కావడంలో కొంత ఇబ్బంది కలిగిస్తుందేమోననే అభిప్రాయం రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో ప్రత్యేకంగా హీరో హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. ప్రధాన పాత్ర పోషించిన శ్వాసిక భర్తను కోల్పోయి పిల్లల్ని పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేశాక, సమాజం సూటిపోటి మాటలు భరించలేక మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత జరిగే పరిణామాలే వంద దేవుళ్ళులో ఉన్న మెయిన్ పాయింట్.

గతంలో తెలుగులో ఇలాంటివి కొన్ని వచ్చాయి. మా నాన్నకు పెళ్లి, స్రవంతి, సౌందర్య నటించిన అరుంధతి లాంటివి ఈ క్యాటగిరీలో వస్తాయి. అయితే అన్ని సక్సెస్ కాలేదు. కొన్ని ఫెయిలయ్యాయి. వంద దేవుళ్ళు సీరియస్ నెరేషన్ లో వెళ్లడం, అసలు కథ సెకండాఫ్ లో ఉండటం, విజయ్ ఆంటోనీ రెండో సగంలోనే ఎంట్రీ ఇవ్వడం లాంటివి కొంత మైనస్ గా నిలిచాయి. దర్శకుడు శశి కొన్ని అంశాలను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ తీర్చిద్దిద్దిన విధానం.

కాకపోతే ఒకటి గమనించాలి. జనాలు మా ఇంటి బంగారం ఫీవర్ లో ఉన్నారు. ఫ్యామిలీస్ గంపగుత్తగా దానికి వెళ్లిపోతున్నారు. పెద్దిని ఇప్పటిదాకా చూడనివాళ్ళు సండే ఆప్షన్ గా రామ్ చరణ్ కు ఓటేస్తున్నారు. దీవానాకు యూత్ మద్దతు ఏ సెంటర్స్ కు పరిమితమయ్యింది. కంటెంట్ అంతో ఇంతో బాగున్నప్పుడు జనాల్లోకి దాన్ని మరింత బలంగా తీసుకెళ్లాలి. అప్పుడే వంద దేవుళ్ళు లాంటివి కాసిన్ని డబ్బులు చేసుకుంటాయి. వీక్ డేస్ లో ఏం చేయనుందో చూడాలి.

This post was last modified on June 21, 2026 11:12 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

36 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago