Movie News

కంబ్యాక్ హీరోని రిసీవ్ చేసుకున్నారా

దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకప్పుడు పెళ్లి, మనసిచ్చి చూడు, స్నేహితులు, ప్రియా ఓ ప్రియా లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్న నవీన్ సరైన ప్లానింగ్, కంటిన్యుయేషన్ ఉంటే మరో జగపతిబాబు అయ్యేవాడు కానీ వరస ఫ్లాపులతో గ్యాప్ తీసుకోవడం పది సంవత్సరాలు ఇటు వైపు రాకుండా చేసింది. ఇప్పుడు కంబ్యాకని ఫ్యాన్స్ సంతోషపడ్డారు.

ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు వచ్చిన రోజే మా ఇంటి బంగారం రిలీజ్ కావడం, దానికి ఫ్యామిలీస్ సపోర్ట్ పుష్కలంగా దొరకడంతో నవీన్ వడ్డేకు ఓపెనింగ్స్ పెద్దగా కనిపించడం లేదు. అందులోనూ మిక్డ్ టాక్ రావడం, కంటెంట్ పాత స్టైల్ లో ఉందనే ఫీడ్ బ్యాక్ వినిపించడం వసూళ్ల మీద ప్రభావం చూపిస్తోంది. యూత్ ని టార్గెట్ చేసిన దీవానా కనక టాక్ కు తగ్గట్టు స్లో పాయిజన్ లా ప్రేక్షకులకు ఎక్కేస్తే కాంపిటీషన్ మరింత టఫ్ అవుతుంది.

స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ పరంగా నవీన్ వడ్డేని మంచి మార్కులే పడుతున్నాయి కానీ ఇంత లేటుగా వెనక్కు వచ్చినప్పుడు ఎలివేషన్లు, ఫైట్లు కాస్త తగ్గించి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తనను మాస్ గా చూడాలని జనాలు కోరుకోవడం లేదు. హీరోగా చేసినా బిల్డప్ లేని పాత్రలతో అయితేనే ఇప్పటి జెన్ జీ బ్యాచ్ కి నచ్చే అవకాశాలు పెరుగుతాయి. కేవలం ఒకప్పటి ఫ్యాన్స్ ని నమ్ముకుంటే సినిమాలు ఆడే పరిస్థితి లేదు.

ఫైనల్ గా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుకు ఏ ముద్ర పడుతుందనేది ఆదివారం అయ్యాక తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి కొంచెం ఎదురీత అయితే తప్పడం లేదు. ఒకవేళ సోలో డేట్ చూసుకుని ఒక్క సినిమాగా వచ్చి ఉంటే ఫలితం కాస్త మెరుగ్గా ఉండేదేమో. ఇంకో వారం ఆగినా బాగుండేదనే కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాకపోతే జూలైలో నాగబంధం, రావు బహద్దూర్, లెనిన్ లాంటి క్రేజీ రిలీజులు క్యూ కట్టి ఉండటంతో ఇదే సేఫ్ డేట్ అనుకుని ఉండొచ్చు.

This post was last modified on June 20, 2026 2:53 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

1 hour ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

4 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

6 hours ago