Movie News

చరణ్ ఫ్యాన్స్ ఆశలపై సమంత నీళ్లు

పెద్దికి మూడో వారంలో మళ్ళీ పికప్ ఉంటుందని, కొత్త సీన్లు జోడించారు కాబట్టి మరోసారి మంచి నెంబర్లు చూడొచ్చని ఆశించిన రామ్ చరణ్ అభిమానుల ఆశలపై సమంత నీళ్లు కుమ్మరించేసింది. ఒకవేళ మా ఇంటి బంగారంకి ఫ్లాప్ టాక్ వచ్చి ఉంటే వాళ్ళు కోరుకునేది కొంచెమైనా జరిగేదేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు బలంగా దక్కడంతో సామ్ జోరు మాములుగా లేదు. బుక్ మై షోలో గంటకు పదమూడు నుంచి పదిహేను వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముతూ బాప్రే అనిపిస్తోంది.

అలాని పెద్ది ట్రెండింగ్ పరంగా జీరో అయిపోలేదు. గంటకు రెండు వేలకు దగ్గరగా టికెట్లు పోతున్నాయి. మా ఇంటి బంగారం మీద పాజిటివ్ వైబ్స్ ముందు నుంచే ఉన్నాయి. అసలు కంటెంట్ లో ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉన్నప్పటికీ జనం తమ టికెట్ డబ్బులకు న్యాయం చేసే ఎంటర్ టైన్మెంట్ దొరికిందని పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ తో పాటు విలన్ థ్రెడ్ ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే మా ఇంటి బంగారం మరిన్ని అద్భుతాలు చేసేదేమో.

ఇక పెద్ది ఫైనల్ రన్ కు వచ్చేసినట్టేనా అంటే కాదు కానీ రేపు ఆదివారం చాలా కీలకం కానుంది. కాకపోతే పరిమిత స్క్రీన్లతో సర్దుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అయిదు తెలుగు కొత్త రిలీజులతో పాటు హిందీ మూవీ కాక్ టైల్ 2 మార్కెట్ లో వచ్చాయి. సో పెద్దికి మరీ ఎక్కువ ప్రాధాన్యం దక్కడం కష్టమే. వంద దేవుళ్ళు, బాలన్ బాగున్నాయని క్రిటిక్స్ మెచ్చుకుంటున్నా అవి కలెక్షన్లలో కనిపించడం లేదు. ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు కూడా ఎదురీదుతోంది.

రంగస్థలంలో జంటగా నటించిన రామ్ చరణ్, సమంత ఇన్ని సంవత్సరాల తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ లో విడివిడిగా సూపర్ హిట్లు కొట్టడం విశేషం. బ్రేక్ ఈవెన్, లాభాలు, పెట్టుబడి మీద రాబడి కోణంలో చూసుకుంటే సామ్ మూవీదే పైచేయి అవుతోంది. అలాని నాలుగు వందల కోట్లు వసూలు చేసిన పెద్దిని తక్కువ చేయలేము కానీ హిందీ రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కూడా ఆడి ఉంటే ఇప్పటికీ జోరు కొనసాగేది. ఏదైతేనేం ప్యాన్ ఇండియా హిట్ స్టాంప్ అయితే మిస్సయ్యింది.

This post was last modified on June 20, 2026 6:21 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

41 minutes ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

3 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

3 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

3 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

5 hours ago