సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు వసూలు కాగా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి అర మిలియన్ అందుకోవడం సులభమే. అంతకన్నా ఎక్కువే అయినా ఆశ్చర్యం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా బుకింగ్స్ మొదలుపెట్టినప్పటికీ గత ఇరవై నాలుగు గంటల్లో 8 వేలకు పైగా టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోవడం శుభ సంకేతం. ఇంకా ఏపీ తెలంగాణ పూర్తి స్థాయి అమ్మకాలు ప్రారంభం కాలేదు.
పెద్ది థియేటర్ రన్ బాగా నెమ్మదించిపోయిన తరుణంలో ప్రేక్షకులకు నెక్స్ట్ ఛాయస్ మా ఇంటి బంగారమే అవుతోంది. ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్ జొప్పించడం, టీమ్ చేసిన ప్రమోషన్లు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సామ్ కనిపించేలా ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ బాగానే పని చేస్తున్నాయి. అవుట్ అఫ్ ది బాక్స్ పబ్లిసిటీ చేయకపోయినా సమంతకున్న ఇమేజ్ ఫ్యామిలీ జనాలను మొదటి రోజే షో చూసేలా ప్రేరేపిస్తోంది. దానికి నెంబర్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
నటిగానే కాదు నిర్మాతగానూ సమంతకిది పెద్ద ప్రాజెక్టు. ఇంతకు ముందు తీసిన శుభం చాలా తక్కువ బడ్జెట్ కాబట్టి రికవరీ ఇబ్బంది కాలేదు. టాక్ తో సంబంధం లేకుండా గట్టెక్కేసింది. అయితే మా ఇంటి బంగారం థియేటర్ పరంగా బాగా ఆడాలి. పెద్ద అంకెలు నమోదు చేయాలి. అప్పుడే తన మార్కెట్ ఇంకా బలంగా ఉందనే క్లారిటీ ఇతర నిర్మాతలకు వస్తుంది. దీని ఫలితం వచ్చాక కొత్త ప్రాజెక్టులు సైన్ చేయాలనే ఉద్దేశంతో సామ్ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన మా ఇంటి బంగారంలో ఆర్టిస్టులు ఎందరు ఉన్నా ఫోకస్ మొత్తం సమంత మీదే ఉంటోంది. పైగా ఇందులో తను చాలా మాస్ ఫైట్స్ చేసింది. స్క్రీన్ మీద అవి బాగా వచ్చాయని టాక్. ఇదే కాంబోలో గతంలో వచ్చిన హే బేబీకి భిన్నంగా ఈసారి యాక్షన్ టచ్ ఎక్కువగా ఉండబోతోంది. కాంపిటీషన్ లో ఉన్న దీవానా, వంద దేవుళ్ళు, బాలన్, ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు కన్నా మా ఇంటి బంగారం ఎక్కువ ఎడ్జ్ లో ఉంది. టాక్ బాగా వస్తే మాత్రం వసూళ్ల పండగే.
This post was last modified on June 17, 2026 11:39 am
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…