Movie News

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ అద్భుతాలు ఆశించేందుకు లేదు. నాలుగు వందల కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతున్న ఈ మెగా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ ముద్ర పడినా ఉత్తరాది, ఓవర్సీస్ లో ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో బ్లాక్ బస్టర్ స్టాంప్ ఛాన్స్ లేకపోయింది. సింగ్ గీతంకి మల్టీప్లెక్సు ఆడియన్స్ మద్దతు దొరికినా కమర్షియల్ గా లాంగ్ రన్ కొంచెం డౌట్ గానే ఉంది.

ఇప్పుడు రాబోతున్న కొత్త శుక్రవారానికి ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు సినిమాలు బరిలో దిగుతున్నాయి. సమంత ‘మా ఇంటి బంగారం’ అందరికన్నా ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటోంది. విస్తృతంగా ప్రమోషన్లు చేయడంతో పాటు సామ్ ఇమేజ్ ఓపెనింగ్స్ కి దోహద పడేలా ఉంది. తెలంగాణ బుకింగ్స్ మొదలుపెట్టగా ఓవర్సీస్ లో 50 వేల డాలర్ల మార్కు ఆల్రెడీ అందుకుంది. టాక్ ఏ మాత్రం పాజిటివ్ ఉన్నా పెట్టిన బడ్జెట్ మొత్తం మొదటి వారం లోపే రికవర్ చేయొచ్చు.

గీత ఆర్ట్స్ పంపిణి చేస్తున్న ‘దీవానా’ని రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేసేందుకు రెడీ అవుతున్నారట. యూత్ ని టార్గెట్ చేసుకున్న ఈ లవ్ స్టోరీకి సోషల్ మీడియా బజ్ బాగానే ఉంది. విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ఈసారి బిచ్చగాడి కాంబినేషన్ ని వాడుకుని దిగుతోంది. హైదరాబాద్ లో ఈవెంట్ కూడా చేశారు. మంజుమ్మల్ బాయ్స్ తీసిన చిదంబరం దర్శకత్వం వహించిన ‘బాలన్’ ఇదే రోజు వస్తోంది. కేవలం డైరెక్టర్ బ్రాండ్ నమ్ముకున్న మూవీ ఇది.

చాలా గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ ఈ ఎంట్రీ ఇస్తున్న ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ తిరిగి ఈ హీరోకు కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి. కాకపోతే ట్రెండీ కాంపిటీషన్ మధ్య ఈ కమర్షియల్ క్రైమ్ ఎంటర్ టైనర్ ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలి. కాంపిటీషన్ అయితే ఆసక్తికరంగానే ఉంది. చివరిగా మాట్లాడాల్సింది కంటెంట్ మాత్రమే. ఆపై వారం రావాల్సింది లెనిన్ వాయిదా పడటంతో పైన చెప్పిన అయిదు సినిమాలకు ఎక్స్ ట్రా థియేటర్ రన్ దక్కుతుంది. వసూళ్ల పరంగా ఇది చాలా మేలు చేస్తుంది.

This post was last modified on June 16, 2026 12:01 pm

Share

Recent Posts

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

3 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

4 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

5 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

5 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

5 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

6 hours ago