లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం తీసిన అత్యుత్తమ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా అది గొప్పగానే అనిపిస్తుంది. ఈ చిత్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల ఆధారంగా తీసిన సినిమా అన్నది తెలిసిన విషయమే. ఆ పాత్రలను మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ పోషించారు. వీరి కలయికలో ఆ చిత్రంలో ఎన్నో ఐకానిక్ సీన్లు ఉంటాయి. అందులో టెర్రస్ సీన్ ఒకటి.
మేడ మీద మాట్లాడుకుంటుండగా మోహన్ లాల్‌ను రాజకీయాల్లోకి రమ్మని ప్రకాష్ రాజ్ ఆహ్వానిస్తే.. సినిమా నటుడినైన తాను రాజకీయాల్లోకి రావడమేంటి అంటూ లాల్ అభ్యంతరం చెబుతాడు. అప్పుడు అలా మాట్లాడుకుంటూ ముందుకు నడిచి వస్తే ఒక పెద్ద జనసందోహం నిలబడి ఉంటుంది. వారికి లాల్ అభివాదం చేయగానే జనం సంబరం మామూలుగా ఉండదు. ఆ ఆదరణను చూపిస్తూ.. నువ్వు రాజకీయాల్లోకి వస్తే చరిత్ర సృష్టిస్తావంటూ ప్రకాష్ రాజ్ తనను పాలిటిక్స్ వైపు మళ్లిస్తాడు.
ఈ సన్నివేశానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి అట. ఈ విషయాన్ని ఒక మలయాళ ఇంటర్వ్యూలో అలనాటి హీరోయిన్, మణిరత్నం సతీమణి సుహాసిని వెల్లడించడం విశేషం. తాను, చిరంజీవి కలిసి ఒక సినిమా చేసినపుడు తిరుపతికి వెళ్లినప్పటి అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
తాను, చిరు ఒక ఇంటి మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటే తన ఫాలోయింగ్ గురించి చిరు తక్కువ చేసి మాట్లాడాడని.. అప్పుడు కాస్త ముందుకు వచ్చి చూస్తే మొత్తం తిరుపతి జనం అంతా చిరు కోసం ఎదురు చూస్తున్న దృశ్యం కనిపించిందని.. ఇదే విషయాన్ని తాను తన భర్త మణిరత్నంతో పంచుకుంటే, ఆయన ‘ఇద్దరు’ సినిమాలో ఒక ఐకానిక్ సీన్‌ను క్రియేట్ చేశారని సుహాసిని వెల్లడించారు.
This post was last modified on June 13, 2026 1:30 pm
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి కీలకంగా మారిన మూడు మునిసిపల్ కార్పొరేషన్ల వ్యవహారం.. ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లోనే కాదు..…