Movie News

చాలామంది పెద్ది పోవాల‌ని కోరుకున్నారు

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా నెగెటివిటీ సినిమాల‌కు ఎంత న‌ష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని, త‌మ ఫేవ‌రెట్ హీరో సినిమాకు ఎలివేష‌న్ ఇచ్చుకోవ‌డంకంటే అవ‌త‌లి హీరో సినిమా మీద విషం క‌క్క‌డానికే అభిమానులు ప్రాధాన్యం ఇచ్చే ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ‌వుతుంటే.. అవ‌త‌ల వేరే హీరోల ఫ్యాన్స్ అంతా ఒక్క‌టై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. త‌ర్వాత ఆ హీరో సినిమా రిలీజ‌పుడు ఈ హీరో ఫ్యాన్స్ రంగంలోకి దిగుతున్నారు.

దీంతో ఎంత మంచి సినిమాకైనా నెగెటివిటీ త‌ప్ప‌ట్లేదు. ఇదే విష‌య‌మై సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు పెద్ది ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానాతో క‌లిసి చేసిన ఒక ప్ర‌మోష‌న‌ల్ ఇంటర్వ్యూలో స్పందించారు. పెద్ది సినిమాకు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన నెఎటివ్ కామెంట్లు, రివ్యూలు రావ‌డం గ‌మ‌నించాన‌ని.. అది చూసి తాను చాలా నిరాశ‌చెందాన‌ని జ‌గ‌ప‌తి చెప్పారు.

ఈ సినిమాను మొద‌టి రెండు మూడు రోజుల్లో ఎక్కువ‌గా రామ్ చ‌ర‌ణ్ అభిమానులు, రెగ్యుల‌ర్ సినిమా గోయ‌ర్స్‌తో పాటు.. యాంటీ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్య‌లోనే చూశార‌ని ఆయ‌న‌న్నారు. ఇలా థియేట‌ర్ల‌కు వ‌చ్చిన వాళ్ల‌లో 90 శాతం మంది సినిమా పోవాల‌నే కోరుకునే వాళ్లే ఉంటార‌ని జ‌గ‌ప‌తిబాబు వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ప్ర‌తి పెద్ద సినిమాకూ ఇలాంటి నెగెటివిటీ స‌హ‌జం అయిపోయింద‌ని.. వీళ్లు ప‌ని గ‌ట్టుకుని సినిమా మీద విష ప్ర‌చారం చేస్తుంటార‌ని ఆయ‌నన్నారు. ఐతే పెద్ది సినిమా ఈ నెగెటివిటీని దాటుకుని ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింద‌ని జ‌గ‌ప‌తిబాబు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు ఈ సినిమా బాగా న‌చ్చింద‌ని.. త‌న‌తో కూర్చుని మాట్లాడిన‌ చాలామంది సినిమా ఇంత బాగుంటే, నెగెటివ్ రివ్యూలు, కామెంట్లు ఇస్తున్నారేంటి అని త‌న ద‌గ్గ‌ర ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు జ‌గ‌ప‌తిబాబు వ్యాఖ్యానించారు.

రూ.300 టికెట్ రేటు పెట్టి సినిమా చూసే వ్య‌క్తి సినిమా మీద నెగెటివ్ కామెంట్లు, రివ్యూలు చేయ‌డం ద్వారా 10 వేల రూపాయ‌లు సంపాదిస్తున్నాడ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కానీ 350 కోట్లు పెట్టి సినిమా తీసే మ‌న‌కంటే 300 పెట్టి సినిమా చూసే ప్రేక్ష‌కుడే కింగ్ అని ఆయ‌న పేర్కొన్నారు.

This post was last modified on June 11, 2026 7:21 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

1 hour ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

2 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

2 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

అంతా బానే ఉన్నట్టుగా వైసీపీ ప్రచారం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం మాట ఎలా ఉన్నా.. నాయ‌కుల‌ను బ‌లోపేతం చేసేందుకు.. వారిని కొంత ఉత్తేజ ప‌రిచేందుకు…

6 hours ago