Movie News

యంగ్ హీరో దర్శకత్వ కల… ‘రియాలిటీ’లోకి

దర్శకులు నటులుగా మారినంత తేలిగ్గా.. నటులు దర్శకులు కాలేరు. ఎందుకంటే 24 విభాగాలనూ కోఆర్డినేట్ చేస్తూ సినిమా తీయడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అందుకే అన్ని విభాగాల మీద పట్టున్నా.. వందల సినిమాల అనుభవం ఉన్నా కూడా దర్శకత్వం జోలికి వెళ్లరు ఆర్టిస్టులు. ఐతే ఈ తరం కుర్ర హీరోలు మాత్రం కెరీర్ ఆరంభంలోనే దర్శకులైపోతున్నారు. అడివి శేష్, విశ్వక్సేన్ లాంటి యంగ్ హీరోలు ఇప్పటికే దర్శకత్వంలోకి అడుగు పెట్టారు.

ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా వీరి బాటలోనే నడవబోతున్నాడు. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలో అతను దర్శకుడి అవతారం ఎత్తుతున్నాడు. ‘రియాలిటీ’ పేరుతో తెరకెక్కబోయే తన చిత్రానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన కిరణ్.. శుక్రవారమే ముహూర్త వేడుక నిర్వహించబోతున్నాడు. చాగంటి సుధాకర్ అనే కొత్త నిర్మాత జయ్ ఫిలిమ్స్ బేనర్ మీద మంచి బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

కిరణ్ దర్శకుడు కాబోతున్నాడని కొన్ని నెలల ముందే వార్తలు వచ్చాయి. ‘రియాలిటీ’ అనే టైటిల్ కూడా ముందే లీక్ అయింది. ఈ చిత్రంలో తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఓ కీలక పాత్రలో నటిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. ఐతే ‘కే ర్యాంప్’తో హిట్టు కొట్టి, ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి క్రేజీ మూవీతో కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్న దశలో కిరణ్‌కు డైరెక్షన్ రిస్క్ అవసరమా అనే చర్చ జరిగింది.

అతను కూడా ఒక దశలో ఈ సినిమాను హోల్డ్‌లో పెట్టాలని భావించాడు. వీర కోగటం అనే సుకుమార్ అసిస్టెంట్‌తో థ్రిల్లర్ సినిమాను ముందుకు తీసుకురావాలనుకున్నాడు. కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ఆలోచనతో స్వీయ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేయబోతున్నాడు.

‘చెన్నై లవ్ స్టోరీ’ పూర్తయ్యాక సొంత సినిమా చేస్తూనే.. వీర సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ‘రియాలిటీ’కి కథ, స్క్రీన్ ప్లే కూడా కిరణే సమకూర్చుకున్నాడు. తన తొలి హిట్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కు స్క్రిప్టు రాసుకుంది కిరణే. ఇంకా కొన్ని సినిమాల రైటింగ్‌లో అతడి పాత్ర ఉంది. మేకింగ్‌లో కూడా బాగా ఇన్వాల్వ్ అయిన అనుభవంతో దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని పకడ్బందీగా తీయగలననే నమ్మకంతో ఉన్నాడు కిరణ్.

This post was last modified on June 11, 2026 4:36 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

53 minutes ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

2 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

7 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

8 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

11 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

11 hours ago