తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఈ విషయంలో దక్షిణాదిన తమిళులు, కన్నడిగులు, మలయాళీలు ఎప్పుడూ ముందే ఉంటారు. సినీ రంగానికి సంబంధించి కూడా మనకు ఘనమైన వారసత్వం ఉన్నప్పటికీ.. ముందుతరం దిగ్గజాల సేవలను సరిగా గుర్తుంచుకోం, గౌరవించుకోం అనే అభిప్రాయం తప్పేమీ కాదు.
దర్శకరత్న దాసరి నారాయణరావు స్మృతి వనం ఎంతటి దుర్భర స్థితికి చేరుకుందో ఇటీవలే చూశాం. దేశం గర్వించదగ్గ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను తమిళులు, ఇతర భాషల వాళ్లు సెలబ్రేట్ చేసినట్లుగా మనం చేయం అన్నది నిష్ఠుర సత్యం. ఐతే కాలం చేసిన వాళ్ల సంగతి పక్కన పెడితే.. ఇంకా జీవించి ఉన్న దిగ్గజాలను మనం ఎంతమాత్రం గౌరవిస్తాం అన్నది కూడా ప్రశ్నార్థకమే.
సింగీతం శ్రీనివాసరావు లాంటి దిగ్దర్శకుడు తెలుగువాడైనందుకు మనం ఎంతో గౌరవించాలి. పుష్పకవిమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడాయన.
ఈ లెజెండరీ డైరెక్టర్ 94 ఏళ్ల వయసులోనూ ఉత్సాహం తగ్గకుండా ‘సింగ్ గీతం’ అనే చిత్రాన్ని రూపొందించి ఔరా అనిపించారు. ఇది కూడా మరో వినూత్న ప్రయోగం లాగే కనిపిస్తోంది.
ఐతే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి దీనికి ఆశించినంత మద్దతు లభిస్తుందా అన్న సందేహం కలుగుతోంది. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కాబోతుండగా.. బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈ మధ్య చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమైపోతోంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. నెల తిరక్కముందే సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తుండడం.. టికెట్ల ధరలు పెరిగిపోతుండడం.. సినిమాల్లో కంటెంట్, క్వాలిటీ అంతంతమాత్రంగా ఉంటుండడం.. ఇలాంటి కారణాలతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయింది.
దీంతో చిన్న సినిమాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఐతే ‘సింగ్ గీతం’ అనే సినిమాను ప్రేక్షకులు ఈ కోణంలో చూడకూడదు. ముఖ్యంగా సింగీతం తీసిన అద్భుత చిత్రాలను చూసి గొప్ప అనుభూతిని పొందిన ముందు తరం ప్రేక్షకులు ఆయన మీద గౌరవ భావంతో థియేటర్లకు రావాల్సిన అవసరముంది.
ఏమాత్రం లాభాపేక్ష లేకుండా, కేవలం సింగీతంను గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో నాగ్ అశ్విన్, అశ్వినీదత్.. ఈ సినిమాకు గొప్ప మద్దతునిచ్చారు. రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ వయసులో సింగీతం కలను నెరవేర్చారు. ఇలాంటి ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి కూడా అదే స్థాయిలో మద్దతు అవసరం.
సింగీతం ఎన్నో ఏళ్ల కల ఈ సినిమా. పైగా నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి తెర వెనుక అన్నీ తానై వ్యవహరించాడు. కాబట్టి ఇందులో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘సింగ్ గీతం’ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచే చిత్రంగానే రూపొంది ఉండొచ్చు. అసలు ఈ చిత్రం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెట్టి.. తెలుగు సినిమాకు ఎనలేని సేవలు చేసిన సింగీతం లాంటి దిగ్గజానికి దర్శకుడిగా ఘనమైన వీడ్కోలు ఇవ్వడానికైనా థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడాల్సిన బాధ్యత తెలుగు ప్రేక్షకులపై ఉందనడంలో సందేహం లేదు.
This post was last modified on June 11, 2026 2:54 pm
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…