ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్ బుర్రా మధ్య చిన్నపాటి వివాదం రేగిన సంగతి తెలిసిందే. తన కథను ఇష్టం వచ్చినట్టు మార్చేశారని ఆయన, లేదూ పిలిచినా రాకుండా పెద్ద సినిమాలకు వెళ్లిపోయారని ఆవిడ పరస్పరం తమ వెర్షన్లు చెప్పుకున్నారు. తర్వాత అది ఫ్లాప్ కావడం, అందరూ మర్చిపోవడం జరిగిపోయింది. తాజాగా పోలీస్ కంప్లయింట్ అనే మూవీ విషయంలో ఇది మళ్ళీ రిపీట్ అవుతోంది.
ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఈవెంట్ లో దర్శక నిర్మాత మాట్లాడుతూ ఎంత బ్రతిమాలినా వరలక్ష్మి ఏదో ఒకసాకు చెప్పి తమ ప్రమోషన్లకు రాలేదని, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పాక మూడు నెలలు సరస్వతి కోసం బ్రేక్ తీసుకుందని, దాని వల్లే తాము ఆలస్యంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. షూటింగ్ టైంలో చిన్న ప్రమాదం జరిగితే పూర్తి సహకారం అందించామని, అయినా సరే పబ్లిసిటీకి రాకుండా ఇలా తిరస్కరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇందులో నిజమెంత ఉందో తేలాలంటే వరలక్ష్మి వైపు నుంచి కూడా వివరణ వచ్చాక క్లారిటీగా అర్థమవుతుంది. అయితే కారణాలు ఏమైనా ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు తమ వంతుగా ప్రచారంలో భాగం కావడం అవసరం. పోలీస్ కంప్లయింట్ ట్రైలర్ చూస్తుంటే క్యాస్టింగ్ గట్టిగానే పెట్టుకున్నారు. నవీన్ చంద్ర, రవి శంకర్, శ్రీనివాసరెడ్డి, ఆదిత్య ఓం, సప్తగిరి, జెమినీ సురేష్ లాంటి సీనియర్లు ఉన్నారు. క్రైమ్, హారర్ రెండూ మిక్స్ చేసి ఏదో వెరైటీ పోలీస్ డ్రామా ట్రై చేశారు.
దర్శకుడు అన్నట్టు పెద్ది కోసం రామ్ చరణ్ రోజు కనిపించాడు, సింగీతం శ్రీనివాసరావు గారు 94 వయసులో మీడియా ముందుకొచ్చారు నిజమే. నటీనటులకే కాదు అందరికీ ఈ బాధ్యత ఉంటుంది. ప్రతి దానికి కాకపోయినా కనీసం ఒకటో రెండో ఈవెంట్లలో పాల్గొంటే ఆడియన్స్ లో కొంత అటెన్షన్ వస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా స్పందించాల్సి ఉంది. అయినా అసలే బజ్ లేకుండా వస్తున్న పోలీస్ కంప్లయింట్ ని నిలబెట్టాల్సింది పబ్లిక్ టాకే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
