ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే రాబోయే అయిదారు నెలల్లో తమన్ తుపాకీ నుంచి ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు పవర్ ఫుల్ బుల్లెట్లు దిగబోతున్నాయి. తన ఓజి కన్సర్ట్ విశేషాలను పంచుకోవడానికి మీడియాను కలుసుకున్న ఈ మ్యూజిక్ సెన్సేషన్ తన రాబోయే ప్రోజెక్టుల గురించి ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే అంచనాలు పెరిగిపోయేలా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
మొదటిది బాలయ్య 111. వీరసింహారెడ్డి కాంబోని రీయట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ టీజర్ జూన్ 10 రానుంది. దసరాకి సినిమా విడుదల కావొచ్చని ఫిలిం నగర్ టాక్. ఇది ష్యుర్ షాట్ బ్లాక్ బస్టరని తమన్ హామీ ఇస్తున్నాడు. క్యాస్టింగ్ లో స్టార్స్ లేకపోయినా ‘ఇట్లు అర్జున’ కూడా అదే కోవలోకి చేరే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎన్ని రోజులు ఆడుతుందో చెప్పలేనంత గొప్ప ఫన్ తో వస్తోందని ఊరించాడు.
వీటికన్నా ముందు విడుదలయ్యే ‘లెనిన్’ ఖచ్చితంగా అఖిల్ కెరీర్ బెస్ట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ని అక్కినేని ఫ్యాన్స్ కి ఇచ్చాడు. మెగాస్టార్ 158 గురించి చెబుతూ ఇది నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రత్యేక ఎలివేషన్ ఇచ్చాడు. ఒక కమర్షియల్ సబ్జెక్టు దొరికితే చిరంజీవికి బెస్ట్ ఇస్తానని చెప్పిన తమన్ కు ఆ మాట నిలబెట్టుకునే టైం వచ్చింది. స్టేజి మీద చెప్పింది ఇవే అయినా తమన్ ఖాతాలో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, తమిళ మూవీ ఇదయం మురళి, సందీప్ కిషన్ సిగ్మా కూడా ఉన్నాయి.
మొత్తానికి ఎనిమిది సినిమాలతో తమన్ పలకరింపు ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఇంత బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో అనిరుద్ రవిచందర్, తమన్ నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఎంపిక లిమిటెడ్ గానే ఉంది. పైగా హీరో కూడా అయ్యాడు. రవి బస్రూర్ కౌంట్ పెద్దదే ఉంది కానీ డ్రాగన్ వచ్చే దాకా తన బెస్ట్ కోసం ఎదురు చూడాల్సిందే. ఇక తమన్ పైన చెప్పిన వాటిలో నాలుగైదు ఛార్ట్ బస్టర్స్ కొట్టినా చాలు తిరిగి టాప్ కు వచ్చినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates