హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకుడు. అయ్యప్పస్వామి మాలలో రవితేజ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుండటంతో అభిమానులు దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ కాగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇక అసలు విషయానికి వద్దాం.
ఆగస్ట్ 21 ముందు నుంచి ది ప్యారడైజ్ లాక్ చేసుకున్న డేట్. ఖచ్చితంగా అదే తేదీకి వస్తామని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పదే పదే చెబుతూ వచ్చారు. నాని కూడా ఆ నమ్మకంతోనే ఇంకో సినిమా సెట్లో అడుగుపెట్టకుండా జడలను కొనసాగిస్తూ దీని మీదే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇరుముడి అనౌన్స్ మెంట్ రావడం చూస్తుంటే ప్యారడైజ్ మళ్ళీ వాయిదా పడిందనే ప్రచారానికి బలం చేకూరినట్టే. ఇదే నిజమైతే మటుకు డిసెంబర్ లేదా అటుపై ఏడాదికి వెళ్లాల్సి రావొచ్చు.
దీనికి సంబంధించి వీలైనంత త్వరగా ప్యారడైజ్ టీమ్ స్పష్టత ఇవ్వడం అవసరం. ఇప్పటికే రెండు మూడు డేట్లు మారిపోయాయి. హిట్ 3 వచ్చి ఏడాది దాటేసింది. నాని కొత్త మూవీ కోసం ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అందులోనూ ఎన్నడూ చేయని ఒక డిఫరెంట్ షాకింగ్ క్యారెక్టర్ లో నాని విశ్వరూపం చూడొచ్చనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. అయితే అన్న మాట మీద నిలవలేకపోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు జూన్ నడుస్తోంది. ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే ప్యారడైజ్ రిలీజ్ కు కేవలం కొంచెం అటు ఇటుగా డెబ్భై రోజుల సమయం మాత్రమే ఉంది. షూటింగ్ ఇంకా అయిపోలేదు. అనిరుద్ మొత్తం ఆల్బమ్ ఇచ్చాడో లేదో తెలియదు. పైగా రీ రికార్డింగ్ కి ఎక్కువ సమయం కావాలి. ప్రమోషన్లకు ఓ రెండు వారాలు కంపల్సరి. ఇంత టైట్ షెడ్యూల్ లో ప్యారడైజ్ కొత్త అనుమానాలు లేవనెత్తుతోంది. ఇలా అయితే న్యాచురల్ స్టార్ అభిమానులు ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates