Movie News

తెలుగు రాష్ట్రాల థియేటర్లు ‘పెద్ది’ఫైడ్

నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా వస్తే ఎంత సందడిగా ఉంటుందో, పరిశ్రమకు ఎంత శుభ సంకేతాలు ఇస్తుందో మరోసారి రుజువయ్యింది. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు ఉన్నప్పటికీ రామ్ చరణ్ కష్టానికి అది వర్త్ అన్నంత రేంజ్ లో కేవలం అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు, కుటుంబాలు నిన్న పెద్ద సంఖ్యలో కనిపించడం పెద్ది మీదున్న క్రేజ్ కు నిదర్శనం.

హైదరాబాద్ లో ఆలస్యంగా బుకింగ్స్ మొదలుపెట్టినప్పటికీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఏపీ గురించి చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న సెంటర్లు సైతం హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. పలు చోట్ల బ్లాక్ దందా, రికమండేషన్లు నడిచేంత స్థాయిలో టికెట్ల కోసం డిమాండ్ ఏర్పడింది. ట్రైలర్ సమయంలో హైప్ కొంచెం హెచ్చుతగ్గులకు గురైనట్టు కనిపించినా ఒక్కరోజులో వాతావరణం మారిపోయింది. ఆడియన్స్ ఎంత ఆకలి మీద ఉన్నారో ఓపెనింగ్స్ స్పష్టం చేయబోతున్నాయి.

ఇవాళ దాదాపు అన్ని మెయిన్ సెంటర్స్ లో టికెట్ ముక్క లేనంతగా ఫుల్ అయిపోయాయి. గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ స్కూల్స్, కాలేజీల సెలవులు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో వసూళ్ల పరంగా ట్రేడ్ ధీమాగా ఉంది. అందులోనూ రూటెడ్ స్టోరీ కావడంతో మాస్ కేంద్రాల్లో జనాలు బాగా వస్తున్నారు. ఎర్లీ ప్రీమియర్ల నుంచి టాక్ పాజిటివ్ గానే ఉంది. రామ్ చరణ్ పెర్ఫార్మన్స్, బుచ్చిబాబు డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

పబ్లిక్ తీర్పు ఏ స్థాయిలో ఉంటుందనేది వారం పది రోజులు ఆగాక క్లారిటీ వస్తుంది. పెద్ద నెంబర్లు ఖాయమే. సోషల్ మీడియాలో అధిక శాతం పాజిటివ్ రియాక్షన్లు కనిపిస్తున్నాయి. కొంత మిశ్రమ స్పందన లేకపోలేదు కానీ ఇలాంటి భారీ అంచనాలున్న సినిమాలకు ఇది సహజమే కాబట్టి ఇంకొన్నిరోజులు వేచి చూడాలి. సామాన్య ప్రేక్షకులే కాదు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం నిన్న పెద్ది ప్రీమియర్ షో కోసం క్యూ కట్టారు. ఆ వీడియోలు ఎక్స్, ఇన్స్ టాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on June 4, 2026 10:34 am

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

12 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

32 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago