తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట నడుస్తున్న ఒక వ్యక్తి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అతను చరణ్ బాడీగార్డ్ అన్న సంగతి అర్థమవుతోంది. ఐతే ఇండియాలో ఎంతోమంది అందుబాటులో ఉండగా.. విదేశాల నుంచి ఒక బాడీగార్డ్‌ను తెచ్చుకోవడం, ఎవ్వరూ ఊహించలేని స్థాయిలో జీతం ఇస్తుండడం గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఆ బాడీగార్డ్‌కు రోజుకు రూ.2 లక్షలు చెల్లిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు రావడం సంచలనం రేపింది. మరీ అంత జీతం ఇచ్చేంత ప్రత్యేకత అతడిలో ఏముంది.. చరణ్ తన చేతికి గాయమైన నేపథ్యంలో ఈ కొన్ని రోజులకే ఈ కాస్ట్‌లీ బాడీగార్డ్‌ను పెట్టుకున్నాడేమో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ సైతం మీడియా ముందు తన బాడీగార్డ్ గురించి స్పందించాడు.
తన బాడీగార్డ్ పేరు కెవిన్ అని వెల్లడించిన చరణ్.. అతనేమీ తాత్కాలికంగా తనకు సేవలందించట్లేదని తెలిపాడు. కెవిన్ జీతం గురించి ప్రస్తావించకుండా.. తన గురించి వివరాలు వెల్లడించాడు చరణ్. తన బాడీగార్డ్ కెవిన్ గురించి ఇటీవల చాలా మాట్లాడుతున్నారని.. ‘పెద్ది’ కోసమే అతన్ని తీసుకోలేదని చరణ్ స్పష్టం చేశాడు.
తన కోసం మాత్రమే కాక, భార్య ఉపాసన, పిల్లలు, మొత్తం కుటుంబం అందరికీ కెవిన్ వ్యక్తిగత రక్షణ ఇస్తున్నాడని చరణ్ వెల్లడించాడు. మీడియా వాళ్లు అతణ్ని బాగా ఫేమస్ చేసేశారని.. ఇప్పుడు అతణ్ని బయటికి పంపడం లేదని.. కెవిన్‌కు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి తన వ్యక్తిగత విషయాలు రాబడతారేమోనని చరణ్ చమత్కరించాడు.
కెవిన్ గత నాలుగేళ్లుగా తమ కుటుంబం బయటికి వెళ్లినప్పుడు.. ఈవెంట్లు, షూటింగ్స్‌కు, విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు తమతోనే ఉంటూ రక్షణ కల్పిస్తున్నాడని చరణ్ వెల్లడించాడు. ఈ కెవిన్ అసలు పేరు అబ్దు కదీర్ సోవ్ అట. 1998లో గాంబియాలో పుట్టిన.అతను.. ఇంటర్నేషనల్ ఎంఎంఏ ఫైటర్ కూడా అని.. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివాసమున్నాడని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates