Movie News

క్రాక్ టీం సూపర్ ప్లాన్

కొత్త ఏడాదిలో విడుదల కోసం బెర్తు ఖరారు చేసుకున్న తొలి తెలుగు సినిమా ‘క్రాక్’ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు మూణ్నెల్ల కిందటే వెల్లడించారు. అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లే తెరుచుకోలేదు. ఎప్పటికి అవి పున:ప్రారంభం అవుతాయో కూడా స్పష్టత లేదు. అయినా సరే.. సంక్రాంతికి తమ సినిమాను షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి.

50 పర్సంట్ ఆక్యుపెన్సీతో నడవడం మొదలయ్యాయి. ముందు సంక్రాంతి రేసులో నిలిచిన కొన్ని సినిమాలు తప్పుకున్నాయి. కానీ ‘క్రాక్’ మాత్రం సంక్రాంతి రిలీజ్ మాటలకు కట్టుబడి ఉంది. పండక్కే సినిమాను సిద్ధం చేశారు. ఐతే ఈ చిత్రాన్ని ముందు అనుకున్న ప్రకారం అయితే జనవరి 14న సంక్రాంతి రోజే రిలీజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారిపోయినట్లు సమాచారం.

కొన్ని రోజులుగా ‘క్రాక్’ పోస్టర్లు, ఇతర ప్రోమోలను గమనిస్తే సంక్రాంతి విడుదల అంటున్నారు తప్ప రిలీజ్ డేట్ పేర్కొనట్లేదు.
రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాల ప్రోమోల్లో మాత్రం జనవరి 14, జనవరి 15 అంటూ రిలీజ్ డేట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘క్రాక్’ టీం డేట్ మార్చుకోవడం వల్లే ప్రోమోల్లో ‘సంక్రాంతి రిలీజ్’ అని మాత్రమే పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 9నే విడుదల చేయబోతున్నారట.

ప్రస్తుతం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. దీని వల్ల అనుకున్నంత రెవెన్యూ రాదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి నాలుగు చిత్రాలు పోటీ పడితే, అందులోనూ ఒకే రోజు రెండు సినిమాలు వస్తే ఓపెనింగ్స్ బాగా తగ్గుతాయి. అందుకనే ‘క్రాక్’ టీం సూపర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి ముందు వారం రిలీజ్ చేస్తే సోలోగా బాక్సాఫీస్‌ను దున్నుకోవచ్చని.. ఆ తర్వాత పండుగ టైంలో ఎలాగూ మంచి వసూళ్లే ఉంటాయని భావించి ఆ డేట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నేడో రోజే ప్రకటన వచ్చే అవకాశముంది.

This post was last modified on January 1, 2021 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

3 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

3 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

4 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

5 hours ago

నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ – భవిష్యత్ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…

5 hours ago

భగ‌వ‌త్ గారి గీతోప‌దేశం.. మోడీకి మండేలా ఉందే!

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భగ‌వ‌త్‌.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాల‌కు కూడా.. ఐకాన్‌. ఆయ‌న…

6 hours ago