Movie News

లక్ష్యాల వైపు ప్రభాస్ పరుగులు

ది రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ రెండు మోస్ట్ ప్రామిసింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటిది ఫౌజీ. షూటింగ్ చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. చివరి దశ పనులు అంటున్నారు తప్పించి ఎప్పటికి పూర్తవుతుందో నిర్మాతలు చెప్పలేకపోతున్నారు. ఇన్ సైడ్ టాక్ అయితే డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. అఖండ, పుష్ప, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్లు రికార్డులు కొల్లగొట్టింది ఈ వారంలోనే.

ప్రస్తుతానికి ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ లో ఉన్నాడు. ఇది పక్కా రిలీజ్ డేట్ తో ఉంది. అధికారికంగా వచ్చే ఏడాది మార్చి 5 లాక్ చేసుకున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అదే తేదీకి థియేటర్లకు రావాలనే సంకల్పంతో ఉన్నట్టు షూట్ జరుగుతున్న విధానం చూస్తే చెప్పొచ్చు. ప్రభాస్ తో పాటు ఇతర కీలక ఆర్టిస్టులు పాల్గొంటున్న షెడ్యూల్స్ క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. ఫౌజీ కోసం వచ్చే నెల చిన్న బ్రేక్ తీసుకోవచ్చు.

ఇప్పుడు డార్లింగ్ లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్ నిర్మాతల టార్గెట్ మిస్ కాకుండా తన వంతుగా సహకారం అందించి అవసరమైతే దర్శకుల మీద పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేయమని ఒత్తిడి తీసుకురావడం వాటిలో ప్రధానమైంది. ఇది అనుకున్నట్టుగా జరిగితే కేవలం నాలుగు నెలల గ్యాప్ లో రెండు ప్రభాస్ సినిమాలు చూసేయొచ్చు. కల్కి 2 ఎలాగూ 2028 రిలీజ్ కాబట్టి దాని గురించి టెన్షన్ అక్కర్లేదు. సలార్ 2 ఉంటుందో లేదో ప్రశాంత్ నీల్ స్పష్టంగా చెప్పడం లేదు.

ఇప్పటికైతే ప్రభాస్ డైరీ చాలా బిజీగా ఉంది. బాహుబలి తర్వాత అంత పెద్ద సక్సెస్ ఇచ్చే మూవీ కోసం తను ఎదురు చూస్తున్న మాట వాస్తవం. కల్కి బ్లాక్ బస్టరే కానీ రాజమౌళి అంత బలమైన అంతర్జాతీయ ముద్ర నాగ్ అశ్విన్ వేయలేకపోయారు. ఆ అవకాశం ఫౌజీతో ఉందనేది ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకం. ఎందుకంటే దర్శకుడు హను రాఘవపూడి తీసుకున్న ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ అలాంటిది. చూడాలి మరి ప్రభాస్ పరుగులు గమ్యాన్ని అనుకున్న టైంలో చేరుస్తాయో లేదో.

This post was last modified on May 27, 2026 6:09 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

31 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago