హిందీలో మలైకా అరోరా.. తెలుగులో హంసా నందిని లాంటి వాళ్లు కేవలం ఐటెం పాటలతోనే పాపులర్ అయ్యారు. వాళ్లు హీరోయిన్లుగా ఎవరికీ గుర్తుండరు. ఐటెం భామలుగానే పేరు సంపాదించారు. ఐతే ఇంతకుముందు ఐటెం సాంగ్స్‌ను వేరుగా చూసేవాళ్లు. వాటిలో హీరోయిన్లు కనిపించేవాళ్లు కాదు. ఆ తరహా పాటల్లో కనిపించే వాళ్ల స్థాయి కొంచెం తక్కువగా ఉండేది.
కానీ గత కొన్నేళ్లలో శ్రుతి హాసన్, తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేసి ఆ తరహా పాటల స్థాయి పెంచారు. ఆ నేపథ్యంలో వేరే హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి వెనుకాడట్లేదు. ఈ పాటల్లో అందాలు ఆరబోస్తూ మాస్ స్టెప్పులు వేస్తే వచ్చే గుర్తింపు, క్రేజే వేరు. ఇప్పుడు హెబ్బా పటేల్ ఇదే పని చేసింది. రామ్ సినిమా రెడ్ కోసం ఆమె చేసిన దించక్ పాట ఇన్‌స్టంట్ హిట్టయిపోయింది.
ఇంకో రెండు వారాల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దించక్ సాంగ్ లిరికల్ వీడియో వదిలారు. అందులో కొన్ని విజువల్స్ కూడా చూపించారు. మాస్ పల్స్ బాగా తెలిసిన జానీ మాస్టర్.. మాంచి నాటు స్టెప్పులేయించాడు. అవి చూస్తే థియేటర్లలో మాస్ ప్రేక్షకులు కుదురుగా ఉండటం కష్టమే అనిపిస్తోంది.
ఇక తాను నటిస్తున్న సినిమాల్లో రోజు రోజుకూ బోల్డ్ నెస్ పెంచేస్తున్న హెబ్బా ఈ పాటలో మరింతగా అందాలు ఆరబోసింది. ఆమె లుక్స్, డ్రెస్సింగ్, హావభావాలు, స్టెప్పులు అన్నీ కూడా చాలా హాట్‌గా ఉండి కుర్రాళ్ల గుండెల్ని లయ తప్పించేలా ఉన్నాయి. సినిమాలో కచ్చితంగా ఈ పాట హైలైట్ అవుతుందనిపిస్తోంది. హీరోయిన్‌గా కెరీర్‌పై పెద్దగా ఆశల్లేని హెబ్బా.. ఇకపై భీష్‌మ తరహా హాట్ క్యామియోలు.. ఈ తరహా ఐటెం సాంగ్స్ చేస్తూ నడిపించేయొచ్చు అనిపిస్తోంది చూస్తుంటే.
This post was last modified on December 31, 2020 1:14 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…