మోస్ట్ వాంటెడ్ ఫ్రాంచైజ్ లో ఒకటైన దృశ్యం మూడో భాగం ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. ఊహించని విధంగా తెలుగులో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు కావడం గమనించాల్సిన విషయం,. ఎందుకంటే దృశ్యం, దృశ్యం 2లో రాంబాబు పాత్రలో వెంకటేష్ ని చూశాక ఇప్పుడు కొత్తగా జార్జ్ కుట్టిగా మోహన్ లాల్ ఏ మేరకు కనెక్ట్ అవుతారనే దాని మీద జనంలో అనుమానాలు లేకపోలేదు. రీమేక్ ఛాన్స్ తగ్గిపోవడంతో నిర్మాతలు డబ్బింగ్ వెర్షన్ తీసుకొచ్చారు.
తాజా రిపోర్ట్స్, పబ్లిక్ టాక్ గమనిస్తుంటే దృశ్యం మేజిక్ మూడోసారి రిపీట్ కానట్టే కనిపిస్తోంది. చివరి నలభై నిమిషాల్లో కాసిన్ని ట్విస్టులు ఓకే అనిపించినా మిగిలిన సినిమా మొత్తం సీరియల్ లాగా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది ముగింపనే ప్రచారం బాగానే జరగడంతో కేసు ఎలా క్లోజ్ చేస్తారనే ఆసక్తితో జనం బాగానే వచ్చారు. అయితే చివరిలో నాలుగో భాగానికి లీడ్ ఇచ్చిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఇక్కడితో అయిపోలేదనే హింట్ అయితే ఇచ్చారు.
ఈ లెక్కన వెంకటేష్ వదులుకోవడం రైటేనా అంటే ఔననే అంటున్నాయి చూసిన ప్రేక్షక వర్గాలు. బాగా ఓపిక తెచ్చుకుని దృశ్యం కుటుంబం మీద విపరీతమైన అభిమానం ఉంటే తట్టుకోవచ్చు కానీ, మరీ ఎక్కువ ట్విస్టులు స్క్రీన్ ప్లే ఊహించవద్దని ట్విట్టర్ జనాలు చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లా పలు కేంద్రాల్లో మంచి ఆక్యుపెన్సీలు నమోదు కావడం సర్ప్రైజ్. సింగల్ స్క్రీన్ల కన్నా మల్టీప్లెక్సుల్లో క్రౌడ్ బాగా కనిపిస్తోంద.
ఇక ఏ కోణంలో చూసినా తెలుగు స్ట్రెయిట్ సినిమాల వరకు దృశ్యం 2నే చివరిది అనుకోవాలి. ఆదర్శ కుటుంబంతో పాటు అనిల్ రావిపూడి మూవీతో బిజీగా ఉన్న వెంకీ మామ ఆ తర్వాత ఎవరితో చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. హిందీలో రూపొందుతున్న దృశ్యం 3కి మాత్రం హీరో అజయ్ దేవగన్ వేరే కథను ఎంచుకున్నాడు. జీతూ జోసెఫ్ తో ఏవో విభేదాల కారణంగా ఫ్రెష్ సబ్జెక్టు రాయించుకున్నారట. అదెలా ఉంటుందో అక్టోబర్ నెలలో తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates