Movie News

స్పిరిట్… ఈగో vs ఈగో

‘స్పిరిట్’లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే ఫైట్ కేవలం ఒక ఫైట్ కాదు. ఇది రెండు పవర్ సెంటర్ల ఈగో క్లాష్ అని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమా అంటేనే మనుషుల్లోని బేసిక్ పొగరును పవర్ ని బయటికి తీస్తాడు. ‘అర్జున్ రెడ్డి’లో లవ్, ‘యానిమల్’లో ఫాదర్ సన్ బాండ్, రివెంజ్ చూపించాడు. ఇప్పుడు స్పిరిట్ లో అధికారంలో ఉన్నవాడు vs అధికారాన్నే భయపెట్టేవాడు అనే లైన్ తో వెళుతున్నట్లు లీక్స్ వస్తున్నాయి.

సినిమాలో వివేక్ ఒబెరాయ్‌ని తీసుకోవడం వెనక లాజిక్ ఉంది. వివేక్ స్క్రీన్ మీద కనిపిస్తేనే ఒక రకమైన వైబ్ కనిపిస్తుంది. కంపెనీ, రక్తచరిత్ర లాంటి సీనుమాల్లో అది ప్రూవ్ అయింది. ప్రభాస్ స్టార్‌డమ్ ముందు తేలిపోయే విలన్ అయితే కిక్ ఉండదు. వివేక్ కళ్లలో, బాడీ లాంగ్వేజ్‌లో ప్రభాస్‌ని డామినేట్ చేయగలననే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతుంది. సందీప్ కి కావాల్సింది అదే. హీరో గెలవాలి అంటే ముందు విలన్ గట్టిగా ఉండాలి.

ప్రస్తుతం కొంపల్లిలో ఈ సినిమా షూట్ జరుగుతోంది. ఆ సీన్స్ యాక్షన్ కోసం కాదట, డ్రామా కోసం అని టాక్. పోలీస్ స్టేషన్ సెట్ లో సీరియస్ వాతావరణం కనిపిస్తోందట. యూనిఫామ్‌లో ఉన్న ప్రభాస్ లా అండ్ ఆర్డర్. బయటి నుంచి వచ్చిన వివేక్ సిస్టమ్‌ని లెక్కచేయని మనిషి. ఇద్దరూ ఒకరి టెరిటరీలోకి ఇంకొకరు వస్తే వచ్చే టెన్షన్‌ని వంగా క్యాప్చర్ చేస్తున్నాడని తెలుస్తోంది.

డైలాగ్స్ కంటే సైలెన్స్, చూపులతో కొట్టుకునే సీన్స్ అని సమాచారం. ‘యానిమల్’ లో రణ్‌బీర్, బాబీ మధ్య మాటల్లేని వార్ ఎలా వర్కవుట్ అయిందో గుర్తుంది కదా. ఈ కాన్సెప్ట్ వర్కవుట్ అవ్వాలంటే రైటింగ్ కీలకం. ప్రభాస్‌ని ఇప్పటివరకు చాలా మంది దర్శకులు గాడ్ లెవెల్‌లో చూపించారు. బట్ సందీప్ అతన్ని మనిషిగా, కోపం, ఫ్రస్ట్రేషన్ ఉన్న పోలీస్‌గా చూపిస్తే కొత్తగా ఉంటుంది.

అదే టైమ్‌లో వివేక్‌ని రొటీన్ విలన్ చేయకుండా, తనదైన లాజిక్ ఉన్న యాంటీ హీరోగా రాస్తే గేమ్ మారిపోతుంది. ఆడియెన్స్ ఎవరి సైడ్ తీసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వంగా స్టైల్. ఫైనల్‌గా ‘స్పిరిట్’ ప్రభాస్ కెరీర్‌లో డిఫరెంట్ ఫిల్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ‘బాహుబలి’, ‘సలార్’ తర్వాత వరుస యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇంటెన్స్ క్యారెక్టర్ డ్రివెన్ డ్రామా చేయలేదు. వివేక్ ఒబెరాయ్‌తో ఉన్న ఈ ఈగో క్లాష్ అతనికి ఆ స్పేస్ ఇస్తుంది. చూడాలి మరి పొగరుతో ఏ స్థాయిలో హైప్ ఎక్కిస్తారో..

This post was last modified on May 19, 2026 12:47 pm

Share

Recent Posts

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

1 hour ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

2 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

2 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

2 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

3 hours ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

5 hours ago