Movie News

బుచ్చిబాబు లెక్కలు వేరే ఉన్నాయా

నిన్న విడుదలైన పెద్ది ట్రైలర్ కు అందరి నుంచి యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. అధిక శాతం ఫ్యాన్స్ అదిరిపోయిందనే అభిప్రాయం వ్యక్తం చేయగా పెదవి విరిచిన అభిమానులు లేకపోలేదు. ఇలా మిశ్రమ స్పందన ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే టీజర్ నుంచి పాటల దాకా పెద్ది ప్రతిసారి బ్యాంగర్ కొట్టింది. మన దగ్గరే కాదు ఉత్తరాదిలోనూ రీచ్ అయ్యింది. సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివిటీ వచ్చింది. కానీ ట్రైలర్ విషయంలో ఈ బ్యాలన్స్ కొంచెం తప్పింది.

దర్శకుడు బుచ్చిబాబు లెక్కలు వేరే ఉన్నాయా అంటే ఆయన సన్నిహిత వర్గాల నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. పెద్ది ప్రాజెక్టు మీద హైప్ దృష్ట్యా దాని మీద అంచనాలను సరైన రీతిలో ఎస్టాబ్లిష్ చేయాలి. కేవలం ఫ్యాన్స్ ని ఊగిపోయేలా చేయడం కాకుండా సామాన్య ప్రేక్షకుల్లో దీని మీద విపరీతమైన ఆసక్తి కలిగేలా చేయాలి. అందుకే మూడు నిమిషాల్లో నిమిషం దాకా భావోద్వేగాలకు పెద్ద పీఠ వేశారు. ఇది సహజంగానే కొంత ప్రభావం చూపించి ఉంటుంది.

అందులోనూ ట్రైలర్ కట్ లో స్టోరీ ఏంటనేది ప్రాపర్ గా చెప్పలేదు. అన్ని ఆటలు ఆడతాడని చెప్పారు తప్పించి, అసలతని జీవితంలో ఏం జరిగింది, ఢిల్లీ దాకా ఎందుకు వెళ్లాడనే అంశాలను కనీసం చిన్న క్లూ రూపంలో ఇవ్వలేదు. డైలాగులు కూడా పరిమితంగా పెట్టి ఎక్కువ యాక్షన్ షాట్స్ పొందుపర్చడం కొంత కనెక్టివిటీని తగ్గించింది. మన శంకరవరప్రసాద్ గారుకి అనిల్ రావిపూడి స్ట్రాటజీ గుర్తు చేసుకుంటే దాని ట్రైలర్ సాదాసీదాగా అనిపించింది.

చిరంజీవి స్వాగ్ ఎంత గొప్పగా వాడాడో రావిపూడి అందులో చూపించలేదు. దీంతో థియేటర్లో సర్ప్రైజులు జనాన్ని ఎంటర్ టైన్మెంట్ తో పాటు థ్రిల్ కూడా చేశాయి. వీరభద్రుడు కూడా ఇదే ఫాలో అయ్యింది. అందుకే తమిళంలో ఆ స్థాయిలో హిట్ చేసి పెడుతున్నారు. పెద్దిలో బయటికి రివీల్ చేయని విషయాలు చాలా ఉన్నాయి. క్రికెట్, కుస్తీ, పరుగు కాకుండా నాలుగో ఆట గురించి లీక్ రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇదంతా ఎలా ఉన్నా విడుదలకు కొద్దిరోజుల ముందు ఇంకో చిన్న ట్రైలర్ అయితే అవసరమయ్యేలా ఉంది. వరప్రసాద్ గారుకి మూడు రోజుల ముందు హుక్ స్టెప్ చేసిన మేలు అంతా ఇంతా కాదు. పెద్దిల్లో అలా టెంప్ట్ చేసే కంటెంట్లు పుష్కలంగా ఉన్నాయట.

This post was last modified on May 19, 2026 2:27 pm

Share

Recent Posts

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

52 minutes ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

2 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

3 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

3 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

3 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

4 hours ago