Movie News

అంతలా నోరు జారకూడదు రష్మికా…

స్టేజ్ మీద ఎక్కితే.. మైక్ అందుకుంటే చాలు ఫిలిం సెలబ్రెటీల్లో చాలామంది అదుపు తప్పేస్తుంటారు. తాము ఏం మాట్లాడుతున్నామో తెలియని స్థితికి వెళ్లిపోతుంటారు. జనాలను చూసిన ఉత్సాహమో.. తమతో స్టేజ్ పంచుకుంటున్న వాళ్లను చూసినపుడు వచ్చే ఉద్వేగమో కానీ.. నోటికొచ్చింది మాట్లాడేసి చిక్కుల్లో పడుతుంటారు. ఈ సోషల్ మీడియా కాలంలో చిన్న పదం తప్పు దొర్లినా.. ట్రోల్స్ తప్పవు. ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది.

సినీ ప్రముఖులు చాలామందికి ఇది అనుభవమే. ఇప్పుడీ జాబితాలోకి రష్మిక మందన్నా కూడా చేరింది. హిందీలో తాను కీలక పాత్ర పోషించిన ‘కాక్ టైల్-2’ సినిమా ప్రమోషన్లలో భాగంగా టీంతో కలిసి ఒక ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. నోరు జారి సోషల్ మీడియాకు టార్గెట్ అయింది.

తన సహ నటి కృతి సనన్ గురించి మాట్లాడే క్రమంలో ముందుగా ఆమె చాలా హాట్‌గా ఉంటుందని చెప్పింది. అంతటితో ఆగకుండా.. ‘ఫ..గ్ హాట్’ అంటూ ఇంగ్లిష్ వాళ్ల స్టయిల్లో ఇంకో పద ప్రయోగం చేసింది. ఇంగ్లిష్ సినిమాల్లో ఈ మాటను చాలా మామూలుగా వాడేస్తుంటారు కానీ.. మన దగ్గర మాత్రం ఆ మాటను జనాలు సీరియస్‌గా తీసుకుంటారు.

రష్మిక వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్‌తో ఈ మాట వాడేయడంతో స్టేజ్ మీద ఉన్న వాళ్లందరూ షాకైపోయారు. కృతితో పాటు హీరో షాహిద్ కపూర్ కూడా అంత మాట అనేశావేంటి అంటూ పగలబడి నవ్వారు. తాను అదుపు తప్పి మాట్లాడానని రష్మిక కొంచెం లేటుగా గ్రహించి, ఈ మాటను పరిహరించండి అన్నట్లుగా మీడియా వాళ్లకు సిగ్నల్ ఇచ్చింది.

కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయి.. ఆల్రెడీ రష్మిక మీద ట్రోలింగ్ మొదలైపోయింది. ఈ అనుభవం తర్వాత అయినా ఫిలిం సెలబ్రెటీలు స్టేజ్ మీద మాట్లాడేటపుడు కొంచెం అప్రమత్తంగా ఉంటారేమో చూడాలి.

This post was last modified on May 18, 2026 2:10 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago