Movie News

బుచ్చిబాబు ఆన్ డ్యూటీ… ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దర్శకుడు బుచ్చిబాబు వీడియో క్లిప్పులు దర్శనమిస్తున్నాయి. పెద్ది ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన పంచుకున్న విశేషాలతో అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు. గత కొద్దిరోజులుగా పబ్లిసిటీ విషయంలో ప్లానింగ్ సరిగా లేదనే అసంతృప్తి మెగాభిమానుల్లో బలంగా ఉంది. దాన్ని తగ్గించే పనిని ఇప్పుడీ క్లిప్పులు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఓ రెండు రోజులు ఇలా మేనేజ్ చేస్తే ట్రైలర్ వచ్చేస్తుంది.

పెద్ది మేకింగ్, రామ్ చరణ్ డెడికేషన్, ఖుషి కపూర్ ని అనుకుని ఆమె అక్క జాన్వీని తీసుకోవడం, చిరంజీవి సెట్స్ కి వచ్చినప్పుడు కాసేపే సమయం గడపడం, ఎమోషనల్ క్లైమాక్స్, ఐటెం సాంగ్, మూడు క్రీడల నేపథ్యం ఇలా బోలెడు కబుర్లు మనసారా పంచుకున్నాడు బుచ్చిబాబు. రెహమాన్ తో అనుభవాన్ని వివరించిన తీరు మ్యూజిక్ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా గ్రౌండెడ్ గా కనిపించే ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అన్ని ఇంటర్వ్యూలు వరసగా ఇచ్చినా ప్రశాంతంగా మాట్లాడ్డం గమనార్హం.

రిలీజ్ ఇంకో పద్దెనిమిది రోజులు మాత్రమే ఉండటంతో థియేటర్లు ఎప్పుడెప్పుడు జూన్ 4 వస్తుందా అని ఎదురు చూస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు అన్నింటికీ వచ్చిన ఓపెనింగ్స్ కలిపినా దాని కంటే పెద్ద మొత్తమే పెద్దికి రిజిస్టర్ అవుతుందని ట్రేడ్ బల్లగుద్ది చెబుతోంది. జనాలు ఎంత కరువులో ఉన్నారో డబ్బింగ్ సినిమా వీరభద్రుడు బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. టాక్ ఎలా ఉన్నా ఒకసారి చూద్దామని మాస్ ఆడియన్స్ వెళ్లిపోతున్నారు.

దానికే ఇలా ఉంటే ఇక పెద్ది చేయబోయే భీభత్సం గురించి వేరే చెప్పాలా. చివరి దశ పనులు ఇంకొంచెం పెండింగ్ ఉండటంతో పాటు వరస ఈవెంట్ల వల్ల బుచ్చిబాబు ముందస్తుగానే తెలుగు మీడియాకు ముఖాముఖీ చేసేశారు. దీని వల్ల పెద్ది ముచ్చట్లు తెలుసుకోవడానికి అడ్వాన్స్ గా దొరికింది. ఎక్కువ లీకులు పంచుకోకపోయినా ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు కాబట్టి ఇంతకన్నా ఆశించడం భావ్యం కాదు. 18న ముంబై ట్రైలర్ వేడుకలో ఏమైనా సర్ప్రైజులు ఉంటాయేమో చూడాలి.

This post was last modified on May 16, 2026 3:23 pm

Share

Recent Posts

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…

43 minutes ago

రెండు పొరపాట్లు ఇంత మూల్యాన్ని చెల్లించాయి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…

1 hour ago

దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి రద్దు!

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ విష‌యాన్ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్…

3 hours ago

బాలయ్య నాని రూటులో చిరు వెళ్లగలరా

గత నాలుగు రోజులుగా మెగాభిమానుల మధ్య జరుగుతున్న డిస్కషన్ ఒకటే. సంక్రాంతికి విశ్వంభర, కాకాలో ఏది విడుదలవుతుందనే దాని మీద…

3 hours ago

హాట్ హాట్‌గానే.. తెలంగాణ పాలిటిక్స్‌!

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గానే ఉన్నాయి. 22ఏ భూముల వివాదం.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కాయి.…

4 hours ago

ఈ క్రికెటర్ ప్రాబ్లం ఏంటి?

ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం? క్రమశిక్షణ, పట్టుదల లేకపోతే ఆ ప్రతిభ సరైన దారిలో వెళ్లదు. ఇందుకు ముంబయి…

4 hours ago