మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జన్మదినం. అదే నెలలో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా జన్మించడం విశేషం. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన తారక్‌కు భారీగా అభిమాన గణం ఉంది. వాళ్లు ప్రతి సంవత్సరం తారక్ పుట్టిన రోజైన మే 20న తమ హీరో సినిమాకు సంబంధించి ఏదో అప్‌డేట్ ఆశిస్తారు. ఈసారి ట్రీట్ చాలా భారీగానే ఉండబోతున్నట్లు ముందే సంకేతాలు అందాయి.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఫస్ట్ గ్లింప్స్ ఈ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. తారక్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా ఇది. కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ ప్రోమోలతో ప్రశాంత్ ఎంతటి సంచలనాలు రేపాడో గుర్తుండే ఉంటుంది. అలాంటి దర్శకుడు తారక్ లాంటి పెద్ద మాస్ హీరోతో సినిమా చేస్తుండడంతో గ్లింప్స్ ఒక రేంజిలో ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
ఈ గ్లింప్స్ లాంచింగ్‌కు ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం. తారక్ పుట్టిన రోజుకు ముందు రోజు అర్ధరాత్రే ఈ వీడియో బయటికి వచ్చేస్తుందట. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు గ్లింప్స్ లాంచ్ చేస్తారట. అంచనాలకు తగ్గట్లే భారీ లెవెల్లో.. యాక్షన్-ఎలివేషన్లతో ఈ గ్లింప్స్ నిండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి గ్లింప్స్ లాంచ్ అంటే.. ఇక ఆ రోజు రాత్రంతా తారక్ అభిమానులకు నిద్ర ఉండదన్నట్లే. గ్లింప్స్ అంచనాలకు తగ్గట్లు ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో సంబరాలు మిన్నంటడం ఖాయం.
ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన ‘డ్రాగన్’.. స్క్రిప్టులో మార్పులు, షూటింగ్ ఆలస్యం వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. 2027 జూన్ 11న ‘డ్రాగన్’ థియేటర్లలోకి దిగుతుంది. తారక్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటించబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టు గురించి కూడా ఈ పుట్టిన రోజుకు అనౌన్స్‌మెంట్ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
This post was last modified on May 12, 2026 12:50 pm
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…