Movie News

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు, 100 రోజుల సెంటర్ల రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి.. కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ‘మగధీర’ వచ్చే వరకు ఆ సినిమా రికార్డులు నిలబడ్డాయి.

రిలీజైనపుడు యావరేజ్ రివ్యూలు, కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ అవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలుగులో వచ్చిన కమర్షియల్ సినిమాల్లో పతాక స్థాయి వినోదాన్ని అందించిన చిత్రాల్లో ఒకటైన ‘పోకిరి’లో కామెడీ కూడా బాగా పేలింది.

బ్రహ్మానందం-ఆలీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఐతే రిలీజ్‌కు ముందు ఈ ట్రాక్ మొత్తం లేపేయాలనే ఆలోచన చేశాడట దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమా రష్ చూసిన వాళ్లు ఈ ట్రాక్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారట. మహేష్ సినిమాలో ఇలాంటి ట్రాక్ బాగుండదని అభిప్రాయపడ్డారట. దీంతో పూరి కూడా ఆ ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆ ట్రాక్ వరకు తీసేద్దామా ఆలోచించాడట.

కానీ ఈ విషయాన్ని ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్‌కు చెబితే.. ఆయన వద్దే వద్దు అని తేల్చేశారట. ‘పోకిరి’ హెవీ డోస్ యాక్షన్ మూవీ అని.. అందులో రిలీఫ్ కోసం ఇలాంటి కామెడీ ట్రాక్ లేకపోతే సినిమా కొంచెం భారంగా మారుతుందని.. ఆ ట్రాక్ చాలా అవసరమని మార్తాండ్.కె.వెంకటేష్ చాలా బలంగా చెప్పారట.

ఆయన మాట మేరకు పూరి దాన్ని అలాగే ఉంచేశాడట. ‘పోకిరి’ సినిమా సూపర్ హిట్ అని డే-1 నుంచి తాము నమ్మామని.. కానీ పూరికి మాత్రం ఆ ట్రాక్ విషయంలో సందేహాలు కలిగాయని.. కానీ తాను మాత్రం అది కూడా వర్కవుట్ అవుతుందని నమ్మానని మార్తాండ్.కె.వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

పూరి టెక్నీషియన్లను ఎంతో గౌరవించే వ్యక్తి అని.. ఎవరు ఫీడ్ బ్యాక్ చెప్పినా చాలా సానుకూలంగా తీసుకుంటాడని.. మార్పులు చేర్పులు చేస్తాడని.. సినిమా బాలేదన్నా ఫీల్ కాడని.. డ్యామేజ్ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మాత్రమే ఇతరుల మాటను పట్టించుకోడని మార్తాండ్ తెలిపాడు.

మరోవైపు వెంకటేష్ ‘జయం మనదేరా’ సినిమా ప్రివ్యూ చూసిన కొందరు జనాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు నిర్మాత సురేష్ బాబు.. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను తీసేసి ఆ చిత్రాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దినట్లు మార్తాండ్ వెల్లడించాడు.

This post was last modified on May 12, 2026 9:10 am

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

10 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago