అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ సినిమా త్వరలోనే మొదలు కానున్న సంగతి తెలిసిందే. సురేందర్ ఈ చిత్రాన్ని ఎవరైనా అగ్ర హీరోతో చేద్దామని అనుకున్నాడు. కానీ అందరు పెద్ద హీరోలు బిజీగా వుండడంతో అఖిల్‍తో ఈ చిత్రం ఖరారు చేసుకున్నాడు. అఖిల్ హీరో అనేసరికి అగ్ర హీరోకు అనుకున్న బడ్జెట్‍లో మూడోవంతుకే ఈ చిత్రాన్ని చేయాల్సి వుంటుంది. ఓ విధంగా అఖిల్ ప్రస్తుత మార్కెట్‍పై అది కూడా రిస్కే. ఈ కారణంగానే సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి పార్టనర్‍షిప్ తీసుకుని చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసిన సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో కథానాయికగా ప్రముఖ మోడల్ సాక్షి వైద్యను ఖరారు చేసినట్టు వినిపిస్తోంది కానీ ఇంకా కచ్చితమైన సమాచారం లేదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్ చిత్రంలో పూజ హెగ్డేతో నటించిన అఖిల్ ఈ చిత్రంలో కూడా లీడింగ్ హీరోయిన్ వుండాలని కోరాడని అప్పట్లో వదంతులు వినిపించాయి. అయితే సురేందర్ రెడ్డిదే ఫైనల్ కాల్ కనుక బడ్జెట్ కారణాల దృష్ట్యా సాక్షి వైద్య ఫైనల్ అయి వుండొచ్చు. ఇది జేమ్స్బాండ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ అని, అఖిల్ ఇందులో స్పైగా కనిపిస్తాడనేది మరో ఊహాగానం. అయితే అందుకు సంబంధించిన క్లారిటీ ఇంకా సురేందర్ నుంచి రాలేదు.
ఇదిలావుంటే అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలా వద్దా అనే దానిపై ఇంకా మీమాంస కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలో దిగడంతో పాటు జనవరి 31 వరకు థియేటర్లపై వున్న ఆంక్షలు కొనసాగనున్న నేపథ్యంలో ఆ చిత్ర బృందం విడుదల తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
This post was last modified on December 29, 2020 10:33 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…