Movie News

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మే 21 ఓపెనింగ్ చేయబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ మొదటిసారి బాలయ్యకు సంగీతం సమకూర్చడం విశేషం. దేవర రూపంలో అద్భుతమైన అవుట్ ఫుట్ ఇచ్చిన తన వైపే కొరటాల మొగ్గు చూపడంతో రెమ్యునరేషన్ అధికమైనా సరే ఓకే అనుకున్నారట. అసలు విశేషం ఇంతకన్నా పెద్దదే ఉంది.

ఇన్ సైడ్ ప్రకారం ఈ సినిమాకు ‘కార్పెంటర్’ అనే పేరు బలమైన పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఈ మధ్య స్టార్ హీరోలు అయితే కోటీశ్వరులు గానో లేదా పెద్ద ఉద్యోగం చేస్తున్న క్యారెక్టర్లే ఎక్కువగా చేస్తున్నారు. కార్పెంటర్ అనేది మన నిత్య జీవితంలో ఎంతగానో ముడిపడిన పేరు. ఏదో ఒక సందర్భంలో వీళ్ళతో పని పడుతూనే ఉంటుంది. పైగా మాస్ కి త్వరగా రీచ్ అవుతుంది. కథ ప్రకారం బాలయ్య వృత్తి అదే కావడంతో దీన్నే లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఇంతకు మించి లీక్స్ రాలేదు కానీ ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఆచార్యలో చిరంజీవి ప్రొఫెషన్ కూడా కార్పెంటరే. పాదఘట్టంకు వచ్చినప్పుడు అక్కడి జనాలకు అలాగే పరిచయమవుతాడు. ఇప్పుడు కొరటాల అదే వృత్తిని బాలయ్యకు పెట్టడం చూస్తుంటే దెబ్బ పడిన చోటే మళ్ళీ ఋజువు చేసుకోవాలనే తపన అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల ఇప్పుడు బాలయ్యకు అంతకన్నా పెద్ద హిట్టు ఇవ్వాలి.

గోపీచంద్ మలినేని ప్రాజెక్టుతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతుందని వినికిడి. విడుదల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిలో ఒకటి 2027 సంక్రాంతికి ఉండాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారట. అఖండ తాండవం 2 డిసెంబర్ లో వచ్చిన నేపథ్యంలో ఈసారి పండగ మిస్ కాకుండా వీలైనంత ట్రై చేస్తారట. ఒకవేళ అనుకున్న టైంకి అన్నీ పూర్తయితే మలినేని తీస్తున్న బాలయ్య 111 దసరా బరిలో ఉండే అవకాశాలు ఎక్కువని చెప్పొచ్చు.

This post was last modified on May 9, 2026 12:53 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago