బెంగళూరు భామ రష్మిక మందన్నాకు ఎక్కడో సుడి ఉన్నట్లే ఉంది. ఇప్పటికే మూడు భాషల్లో నటిస్తున్న ఆమెకు ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిన బాలీవుడ్లోనూ ఛాన్సులు వెతుక్కుంటూ వస్తున్నాయి. దక్షిణాదిన ఆమె నటించిన సినిమాల సక్సెస్ రేట్ చూసో.. లేదంటే ఆ సినిమాల్లో తన పెర్ఫామెన్స్ చూసో లేదంటే సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ చూసో కానీ.. ఇటీవలే మిషన్ మజ్ను అనే పెద్ద ప్రాజెక్టుకు హీరోయిన్‌గా ఎంచుకున్నారు.
సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతను బాగ్చి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. అమర్ బుటాలతో కలిసి ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ న్యూస్ బయటికి వచ్చిన వారం లోపే రష్మికకు మరో పెద్ద బాలీవుడ్ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కినట్లు సమాచారం బయటికి వచ్చింది.
ఈసారి ఆమె ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు డెడ్లీ అనే టైటిల్ కూడా ఖరారు చేశారట. క్వీన్, సూపర్ 30 లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన వికాస్ బల్ ఈ చిత్రానికి దర్శకుడట. ఇందులో అమితాబ్ కూతురిగా రష్మిక నటించనుందట. ఇందులో ఆమెకు జోడీగా నటించే హీరో ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఇందులో భారీ తారాగణమే ఉంటుందట. సోషల్ కాజ్ ఉన్న కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది.
మార్చిలో డెడ్లీ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నారట. బాలీవుడ్లో తొలి సినిమా గురించి ప్రకటన వచ్చిందో లేదో అప్పుడే ఇంత పెద్ద ప్రాజెక్టులో రష్మిక చోటు దక్కించుకుందంటే విశేషమే. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్పలో నటిస్తోంది. తమిళంలో కార్తి సరసన రష్మిక నటించిన సుల్తాన్ విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on December 30, 2020 12:38 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…