కూలీ నంబర్ వన్.. 90ల్లో తెలుగులో సూపర్ హిట్టయిన సినిమా. వెంకటేష్, టబు జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తర్వాత హిందీలో రీమేక్ చేశారు. అప్పుడు గోవిందా, కరిష్మా కపూర్ జంటగా ఆ చిత్రాన్ని రూపొందించిన డేవిడ్ ధావన్.. పాతికేళ్ల తర్వాత అదే పేరుతో కొడుకు వరుణ్ ధావన్‌ను హీరోగా పెట్టి సినిమా తీశారు.
పాత కథకు కొత్త హంగులు అద్ది రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైంది. ఈ మాస్ మసాలా సినిమాకు ప్రైమ్‌లో మంచి స్పందన లభించినట్లే ఉంది. ఇప్పటిదాకా ఇండియాలో రిలీజైన ఓటీటీ సినిమాల్లో 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన చిత్రాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. ఈ లెక్కల్లో ఇదే నంబర్ వన్ అని కూడా అంటున్నారు. కానీ ఈ చిత్రానికి ఐఎండీబీలో వచ్చిన రేటింగ్ మాత్రం షాకింగ్‌గా ఉంది.
బాలీవుడ్లో ఇప్పటిదాకా ఏ పేరున్న సినిమాకూ రాని విధంగా ఐఎండీబీలో ప్రస్తుతం 1.3 రేటింగ్‌తో కొనసాగుతోంది ‘కూలీ నంబర్ వన్’. ప్రేక్షకుల అభిప్రాయం ఆధారంగానే ఐఎండీబీ రేటింగ్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 25 వేల మందికి పైగా రేటింగ్ ఇవ్వగా.. దాని సగటు 1.3కి మించలేదు. ఇప్పటిదాకా ఇండియాలో స్టార్లు నటించిన హిందీ సినిమాల్లో అత్యల్ప ఐఎండీబీ రేటింగ్ తెచ్చుకున్న సినిమా అజయ్ దేవగణ్ ‘హిమ్మత్ వాలా’నే. సల్మాన్ ఖాన్ మూవీ ‘రేస్ 3’కి 1.9 రేటింగ్ వచ్చింది. కమల్ ఆర్.ఖాన్ తీసిన ‘దేశ్ ద్రోహి’ ఇంతకంటే తక్కువ రేటింగ్ తెచ్చుకుంది కానీ.. అతడి స్థాయి దృష్ట్యా దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదు.
రాబోయే రోజుల్లో ‘కూలీ నంబర్ వన్’కు రేటింగ్ ఏమైనా పెరుగుతుందేమో కానీ ఇప్పటికైతే.. స్పందన పూర్తి ప్రతికూలంగా ఉంది. మూడు దశాబ్దాల కిందటి కథతో మరీ రొటీన్‌గా సినిమాను నడిపించడం.. కామెడీ మరీ లౌడ్‌గా ఉండటం.. లాజిక్‌ను అసలేమాత్రం పట్టించుకోకుండా పాత స్టయిల్లో సినిమాను తెరకెక్కించడం ప్రేక్షకులకు నచ్చినట్లు లేదు. రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నప్పటికీ.. అందులో మెజారిటీ జనాలకు సినిమా రుచించట్లేదనడానికి ఐఎండీబీ రేటింగే నిదర్శనం.
This post was last modified on December 30, 2020 12:46 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…