Movie News

లెనిన్ అసలు సమస్య పెద్ది కాదు

జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం చేశామంటూ నిర్మాణ సంస్థ ప్రకటన ఇవ్వడం అక్కినేని అభిమానుల అసంతృప్తికి కారణమయ్యింది. ఫైనల్ కాపీ సిద్ధంగా ఉన్న రేంజ్ లో ఆర్భాటం చేసి రెండు నెలలు ఆలస్యంగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. అయితే పెద్ది ఏప్రిల్ 30 నుంచి తప్పుకుని జూన్ కి రావడం, ఇప్పుడు అదే నెల 25 వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఊపందుకోవడం అసలు ట్విస్ట్.

మరి ఇప్పుడు లెనిన్ మళ్ళీ త్యాగం చేస్తుందా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అంతర్గత సమాచారం ప్రకారం లెనిన్ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. రషెస్ చూసిన నాగార్జున కొంత భాగాన్ని రీ షూట్ చేయమని సలహా ఇచ్చారని, ఆమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే పుకారు ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. ఇది నిజమో కాదో కానీ లెనిన్ రాక మీద అయోమయం ఇంకా కొనసాగనుంది. ముందైతే పెద్ది కొత్త డేట్ అఫీషియల్ అయితే కొన్ని మబ్బులు తొలగుతాయి.

లెనిన్ ని అన్నపూర్ణ, సితార సంస్థలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి. దర్శకుడు మురళికిషోర్ అబ్బూరుకి ఇంత పెద్ద ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన అనుభవం లేకపోయినా కథ మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అఖిల్ బాధ్యతను అప్పజెప్పారు. హీరోయిన్ శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని తీసుకుంటే అదనపు భారమవుతుందని తెలిసినా సరేనన్నారు. ఇంతా చేసి అనుకున్న టైంకి షూట్ అవ్వకపోవడంతో అవసరం లేని కన్ఫ్యూజన్ తెరమీదకు వస్తోంది.

వీలైనంత త్వరగా నిర్మాత నాగవంశీ వీటికి చెక్ పెడితే బెటర్. జూన్ 26కి లెనిన్ కట్టుబడుతుందా లేదా అనేది పెద్ది మీద ఆధారపడి ఉంటుంది. దాంతో క్లాష్ అవ్వాలని అఖిల్, నాగార్జున ఎంతమాత్రం కోరుకోరు. పైగా పెద్ది మీద ఉన్న బజ్ ఆకాశాన్ని హద్దుగా పెట్టుకుంది. తలపెడితే ఎవరికైనా రిస్క్ అనిపించేలా హైప్ పెరుగుతూ పోతోంది. ఒకవేళ పెద్ది కనక జూన్ 25 ఫిక్స్ అయితే అప్పుడు లెనిన్ త్వరగా రావడమో జూలైకి వెళ్లిపోవడమో జరుగుతుంది.

This post was last modified on April 24, 2026 4:49 pm

Share

Recent Posts

బాలిక కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలి

రాప్తాడు జడ్పీ హైస్కూల్లో ఓ బాలికపై ఒక ఉన్మాది పాశవికంగా దాడి చేసిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.…

2 hours ago

ఆమెతో సారీ చెప్పించిన ‘ఆదర్శ కుటుంబం’

గత శుక్రవారం రిలీజైన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వీకెండ్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే ఈ…

3 hours ago

11.11.11.11 వెనక కారణం ఏంటో చెప్పిన సాయి రెడ్డి

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్టీ ఏర్పాటు ముహూర్తం చర్చగా మారడం తెలిసిందే. విజయసాయి వైసీపీలోనూ, జగన్…

4 hours ago

స్నేహం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన లక్ష్మి

సంతోషంలో చాలా మంది చుట్టూ చేరుతారు, ఆపదలో వున్నప్పుడు అండగా నిలబడేది స్నేహితుడు ఒక్కడే. ఆ సత్యాన్ని అక్షరాలా నిరూపించింది…

4 hours ago

ఆప‌ద వేళ‌.. అర్ధ‌రాత్రి వ‌ర‌కు… చంద్ర‌బాబు రివ్యూలు!

మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో…

6 hours ago

చిరు లిస్టులోకి ఇంకో పేరు

70 ఏళ్లు పైబడ్డా సరే, ఈ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ…

7 hours ago