Movie News

సెన్సేషన్ వాలా… ప్లాన్ అదిరిపోలా

మలయాళంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు వాలా 2. అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది రెండు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ బ్లాక్ బస్టర్ కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించడం అసలు విశేషం. కొంచెం ఆలస్యంగా అయినా సరే వాలా 2ని డబ్బింగ్ చేసి తెలుగులో వచ్చే వారం ఏప్రిల్ 24 విడుదల చేయబోతున్నారు. పెద్దగా పోటీ లేదు. హాలీవుడ్ మూవీ మైఖేల్ తప్ప మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న రిలీజులు లేవు.

ఒకరకంగా చెప్పాలంటే ఆలస్యం చేయడం వాలా 2కి మేలే చేస్తోంది. ఎందుకంటే థియేటర్లు ఫీడింగ్ లేక అల్లాడిపోతున్నాయి. ప్రమోషన్లతో తెగ హంగామా చేసిన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ రెండు చేతులు ఎత్తేశాయి. బ్యాడ్ బాయ్ కార్తీక్ మొదటి షోకే సెలవు తీసుకుంది. ఉన్నంతలో డెకాయిట్ కాస్త ఆక్సీజెన్ లా పనిచేస్తోంది కానీ బైకర్, రాకాస ఆల్రెడీ థియేటర్ రన్ పూర్తి చేసుకున్నాయి. సో బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉన్న టైంలో వాలా 2 వస్తోంది.

ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. స్కూల్ కాలేజీ లైఫ్, స్నేహితుల సరదాలు అల్లరి, అమ్మాయిలతో ప్రేమ, బస్ స్టాప్ లో అల్లర్లు, రౌడీల ప్రమేయం వగైరా అన్ని అంశాలు ఇందులో పొందుపరిచారు. ప్రేమలు తరహాలో సెన్సేషన్ అవుతుందో లేక యూత్ లాగా సోసోగా ఆడుతుందో చూడాలి. కంటెంట్ చూస్తుంటే మన జనాలకు కనెక్ట్ అయ్యేలానే ఉంది. గురి కుదిరిందా సూపర్ హిట్టు పడిపోతుంది.

ఎంతలేదన్నా వారం రోజులు సాలిడ్ రన్ దక్కుతుంది. కాకపోతే మన ఆడియన్స్ తో బాగుందనిపించుకోవాలి. లేదంటే రెండో రోజుకే హాండ్స్ అప్ అనాల్సి ఉంటుంది. మన శంకరవరప్రసాద్ గారితో 2026 వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బస్టర్ సాధించిన సాహూ గారపాటికి ఇప్పుడీ వాలా 2 మరింత జోష్ ఇచ్చింది. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కించబోయే మల్టీస్టారర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీని డీల్స్ గురించి అప్పుడే ఫిలిం నగర్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.

This post was last modified on April 20, 2026 7:23 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

27 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

34 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

48 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago