అల్లు అర్జున్ పట్టుదల ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా సాధించాలి అనుకుంటే దాని కోసం విపరీతంగా కష్టపడతాడు. లక్ష్యాన్ని చేరుకునే వరకు నిద్రపోడు. ‘గంగోత్రి’ సినిమాలో లేడీ గెటప్ వేసిన తనను చూసి అందరూ ఎగతాళి చేశారని.. ‘పుష్ప-2’ సినిమాలో మళ్లీ లేడీ గెటప్ వేసి అందరితో చప్పట్లు కొట్టించుకోవడం తనకే చెల్లింది. ‘పుష్ప’ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుని ఔరా అనిపించిన బన్నీ.. ఎన్నో ఏళ్ల ముందే ఆ లక్ష్యం పెట్టుకుని పని చేసినట్లు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్’ షోలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జాతీయ అవార్డు సాధించాలి అని ఆ టార్గెట్‌ను రౌండప్ చేసుకుని ఆ దిశగా పని చేసినట్లు బన్నీ చెప్పిన మాట అభిమానుల మనసుల్లో అలా ముద్ర పడిపోయింది. ఇది సోషల్ మీడియాలో ఒక మీమ్ లాగా కూడా మారిపోయింది. ఇప్పుడు బన్నీ ఇంకోసారి తన సిగ్నేచర్ ‘రౌండప్’ మేనరిజంను ప్రదర్శించడం విశేషం.
ఇటీవలే తన అభిమానులతో బన్నీ ఒక ఫొటో షూట్ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో 900 మందికి పైగా అభిమానులను ఒక చోటికి చేర్చి వారికి ఫొటోలు ఇవ్వడమే కాక.. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కార్డులు కూడా జారీ చేశారు. ఈ కార్యక్రమం అయ్యాక అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో కొందరు అభిమానులు ఆస్కార్ అవార్డు గెలవాలి అంటూ బన్నీని ఉద్దేశించి నినాదాలు చేశారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. ‘రౌండప్’ సిగ్నల్ ఇచ్చాడు.
అంటే ఆస్కార్ అవార్డు గెలవాలి అనే లక్ష్యాన్ని కూడా తాను రౌండప్ చేసుకుంటున్నానని.. భవిష్యత్తులో అది కూడా సాధిస్తానని చెప్పకనే చెప్పాడన్నమాట బన్నీ. ఒకప్పుడు మన వాళ్లు ఎవ్వరైనా ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడితే నవ్వుకునే వాళ్లం కానీ.. ‘ఆర్ఆర్ఆర్’కు రెండు పురస్కారాలు దక్కాక అదేమీ అసాధ్యంగా అనిపించట్లేదు. మన సినిమా వడివడిగా గ్లోబల్ స్థాయికి వెళ్తున్న నేపథ్యంలో బన్నీ ఆస్కార్ అవార్డును టార్గెట్ చేయడంలో తప్పేమీ లేదు. మరి ఈ లక్ష్యాన్ని కూడా అతను భవిష్యత్తులో సాధిస్తాడేమో చూద్దాం.
This post was last modified on July 31, 2026 8:12 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…