కొన్ని రోజుల నుంచి అనుకున్నట్లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది మరోసారి వాయిదా పడిపోయింది. ఏప్రిల్ 30న ఆ సినిమా రావట్లేదు. దీంతో మిడ్ సమ్మర్లో క్రేజీ వీకెండ్‌ను ఉపయోగించుకునే సినిమాలు ఏవని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఓటీటీ డీల్స్ ఎటూ తేలకపోవడం వల్ల రిలీజ్ డేట్లు కన్ఫమ్ చేసుకోవడంలో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు ఇబ్బంది తప్పట్లేదు.
పెద్ది రాకపోతే తాము వస్తామంటూ ముందే మే 1 డేట్‌ను గాయపడ్డ సింహం సినిమా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇది ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయమని దాని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి తోడు.. కామెడీ ప్రధానంగా సాగే మరో చిత్రం మే 1 బాక్సాఫీస్ వేటకు రెడీ అయింది. ఆ చిత్రమే.. జెట్‌లీ.
మత్తువదలరా, మత్తువదలరా-2 చిత్రాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రితేష్ రాణా.. ఆ చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసిన సత్యను హీరోగా పెట్టి రూపొందించిన చిత్రం.. జెట్‌లీ. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి క్రేజీ, ఫన్నీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సత్య కామెడీ టైమింగ్‌ను రితేష్ కంటే బాగా ఇంకెవరూ వాడుకోలేరన్నది స్పష్టం. ఈసారి తన నుంచి ఎక్స్‌ట్రా డోస్ కామెడీ ఉంటుందని తన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన పాటలో సత్య స్టెప్పులు కూడా అదిరిపోయాయి. జెట్‌లీ రిలీజ్ ఇంకా ఆలస్యంగా ఉంటుందని అంచనా వేశారు కానీ.. మంచి డేట్ దొరకడంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదలకు రెడీ అయిపోయింది.
ఇందులో ఏస్ కమెడియన్ వెన్నెల కిషోర్ సత్యతో సమానమైన రోల్ చేస్తున్నాడు. ఇదొక ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కామెడీ ఫిలిం. ఇందులో సత్యకు జోడీగా మాజీ మిస్ ఇండియా యూనివర్శ్ రియా శర్మ నటిస్తుండడం విశేషం. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. మత్తు వదలరా, మత్తు వదలరా-2కు మించి పెద్ద హిట్టయ్యే అవకాశాలున్నాయి. గాయపడ్డ సింహం సైతం కామెడీ ఫిలిమే కావడంతో మే 1న తెలుగు ప్రేక్షకులకు నవ్వుల విందే అన్నమాట.
This post was last modified on April 18, 2026 10:52 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…