2000 సంవత్సరానికి అటు ఇటు ఓ పదేళ్ల పాటు తెలుగులో మిడ్ రేంజ్ సినిమాల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో రాశి ఒకరు. బాల నటిగా పరిచయమై.. ఆ తర్వాత హీరోయిన్ అవతారం ఎత్తిన ఆమె.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల్లో సౌందర్య తరహాలో మంచి గుర్తింపు సంపాదించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక.. కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసిన ఆమె క్రమంగా సినిమాలకు దూరం అయిపోయింది.
శ్రీనివాస్ అనే అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడి ఆమె వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ టీవీ షోల్లో, ఇంటర్వ్యూల్లో కనిపించడమే తప్ప.. నటనకు దాదాపు దూరం అయిపోయింది. ఇప్పుడామె చాన్నాళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించింది. తిరువీర్ లీడ్ రోల్ చేసిన పాపం ప్రతాప్ చిత్రంలో రాశి.. హీరో తల్లి పాత్రలో నటించింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమాలో రాశి చక్కగా నటించి తన పాత్రకు న్యాయం చేసింది.
ఐతే ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశి.. అజయ్ ఘోష్ పక్కన భార్య పాత్ర చేయడం ఆమె అభిమానులకు ఒకింత ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. అభిమానుల కంటే ఈ విషయంలో రాశినే షాకైందట. ఈ సినిమాలో తన పాత్ర గురించి దర్శకుడు దుర్గానరేష్ చెప్పినపుడు.. తాను అజయ్ ఘోష్‌కు జోడీగా నటిస్తానని తెలిపాడట.
ఐతే రంగస్థలంలో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన నటుడిగా అజయ్ ఘోష్ తెలిసినప్పటికీ.. తన పేరు ఐడియా లేదని రాశి చెప్పింది. తన భర్తగా నటించేది పొడవుగా ఉంటూ విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసే అజయ్ అని ఆమె అనుకుందట. ఐతే షూటింగ్ కోసం వెళ్లినపుడు సెట్లో అజయ్ కనిపించకపోవడంతో వెతుకుతూ ఉన్నానని..
అప్పుడే యూనిట్లో ఒక అమ్మాయి వచ్చి దేని కోసం వెతుకుతున్నారని అడిగితే అజయ్ పేరు చెప్పానని.. అప్పుడు అజయ్ ఘోష్‌ను చూపించడంతో తాను షాకయ్యానని రాశి చెప్పింది. ముందు ఆయన్ని చూసినపుడు తనకు మావయ్య రోల్ చేస్తున్నారనుకున్నట్లు రాశి వెల్లడించింది. ఐతే తాను ఇలా అనుకున్నందుకు అజయ్ ఘోష్‌కు సారీ చెప్పిన రాశి.. ఆయన అద్భుతమైన నటుడంటూ పాపం ప్రతాప్ సినిమా సక్సెస్ మీట్లో కొనియాడింది.
This post was last modified on April 18, 2026 11:02 am
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…
జాతీయ గేయం వందేమాతరం వ్యవహారంపై జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…